Site icon NTV Telugu

షేక్‌పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర ప్రమాదం

రోడ్డు ప్రమాదాలు మామూలైపోయాయి. ఇటీవల ప్రారంభం అయిన షేక్ పేట నూతన ఫ్లైఓవర్ నెత్తురోడింది. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ పై వెళుతున్న బైక్‌ను ఢీ కొంది. దీంతో ఫ్లై ఓవర్ పై నుంచి బైక్ తో సహా కింద పడ్డాడు ఆ యువకుడు.

https://ntvtelugu.com/student-tries-take-girlfriend-inside-manipal-hostel-trolley-caught/

దీంతో బ్రిడ్జి పై బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి వంతెనపై నుండి పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

Exit mobile version