Accident : రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని పుప్పాలగూడ అల్కాపూరీ కాలనీలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న తండ్రి–కొడుకుపై వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. వివరాల ప్రకారం.. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుమారుడు కుశల జోయల్‌తో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది.
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు..
ఢీకొట్టిన వేగంతో బాలుడు రోడ్డుపై పడిపోగా, అదే కారు అతనిపై నుంచి దూసుకెళ్లింది. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే స్థానికులు స్పందించి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
Renu Desai : ఎట్టకేలకు సినిమా సైన్ చేసిన రేణు దేశాయ్.. కానీ?
