Site icon NTV Telugu

Rajasthan Crime: తాంత్రికుడి పైశాచికం.. శృంగారం చేస్తున్న జంటపై ఫెవిక్విక్‌ పోసి..

Tantrik Killed Couple

Tantrik Killed Couple

Rajasthan Tantrik Killed Couple While Having Intercourse With Superglue: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక జంట శృంగారం చేసుకుంటున్న సమయంలో.. ఓ తాంత్రికుడు వారిద్దరిపై ఫెవిక్విక్ పోసి, అత్యంత కిరాతకంగా చంపాడు. తన గురించి చెడు ప్రచారం చేశారన్న పగతోనే, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అసలు ఆ జంట ఇతని గురించి చెడు ప్రచారం ఎందుకు చేసింది? ఇతనికి, ఆ జంటకి ఉన్న లింక్ ఏంటి? త్రిల్లర్ సినిమాని తలపించే ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే..

భదవిగూడలోని ఇచ్ఛాపూర్ణ శేషనాగ్‌ భావ్‌జీ మందిరంలో భలేశ్‌ కుమార్‌ అనే తాంత్రికుడు తాంత్రిక కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. ఇతని వద్దకు రెండు కుటుంబాలు పూజలు చేయించుకోవడానికి వచ్చేవి. ఈ క్రమంలోనే ఆ రెండు కుటుంబాల్లోని ఒక ఉపాధ్యాయుడు (30), ఓ మహిళ (28) మధ్య పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరు వివాహితులే. కొన్ని రోజుల తర్వాత అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా ఆ తాంత్రికుడ్ని కలిసే వంకతో.. ఈ ఇద్దరు తమ కామకోరికలు తీర్చుకునేవారు. కొంతకాలం తర్వాత ఈ ఇద్దరి ఎఫైర్ గురించి ఆ తాంత్రికుడికి తెలిసింది. దాంతో అతడు ఆ బంధం పెట్టుకోవద్దని, అది తనపై కూడా చెడు ప్రభావం చూపుతుందని సూచించాడు. కానీ.. వాళ్లిద్దరి ఆ తాంత్రికుడి మాటలు పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన ఆ తాంత్రికుడు.. వారి వివాహేతర సంబంధం గురించి ఉపాధ్యాయుడి భార్యకు చెప్పాడు.

అలా తాంత్రికుడు వారి బంధాన్ని బయటపెట్టడంతో.. రెండు కుటుంబాల్లోనూ గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలకి ఆ తాంత్రికుడే కారణమని.. ఆ జంట అతనిపై దుష్ప్రచారం చేసింది. దాని వల్ల అతని పేరు దెబ్బతింది. దీంతో.. ఆ జంటని హతమార్చాలని కక్ష పెంచుకున్నాడు. వారిని అంతమొందించేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. నవంబర్ 15వ తేదీన ఆ ఇద్దరిని ఏదో మాట్లాడాలని పిలిచి, అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఏవో పూజలు చేయించి, తన ముందే శృంగారం చేయాల్సిందిగా బలవంతంగా చేశాడు. దీంతో.. ఆ జంట శృంగారంలో పాల్గొంది. అప్పుడు తాంత్రికుడు తన వెంట సీసాలో తెచ్చిన ఫెవిక్విక్‌ని వారిపై పోశాడు. దాంతో వారిద్దరి శరీరాలు అతుక్కుపోయాయి. ఒకరినొకరు విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా, ఫలితం లేకుండా పోయింది.

అప్పుడు తాంత్రికుడు తొలుత ఆ ఉపాధ్యాయుడి గొంతు, జననాంగాలను కోసేశాడు. ఆ తర్వాత మహిళను కూడా చంపేశాడు. చంపుతున్నప్పుడు.. తన పేరునే చెడగొడ్తారా అంటూ చెప్తూ మరీ చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కట్ చేస్తే.. నవంబర్ 18వ తేదీన పోలీసులకు వారి మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తాంత్రికుడే వారిని చంపాడని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version