Site icon NTV Telugu

మరో దారుణం.. మహిళపై తుపాకీ ఎక్కుపెట్టి అఘాయిత్యం

మహిళలపై అఘాయిత్యాలకు కొన్ని ప్రాంతాల్లో అడ్డూ అదుపులేకుండా పోతోంది.. ప్రతీరోజూ ఏదో ఒక చోట దారుణమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. బయటకు వెళ్తేనే కాదు.. ఇంట్లో ఉన్నా రక్షణలేని పరిస్థితి ఏర్పడింది.. తన పిల్లలతో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళ ఇంట్లోకి దూరిన యువకులు.. ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది..

ఆ పాశవిక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జాలౌన్‌ జిల్లా ఉరయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో.. తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది ఓ మహిళ.. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన నలుగురు యువకులు.. గోడ దూకి, ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధులను నిలువరిస్తూ.. అరిచేందుకు మహిళ ప్రయత్నించగా.. ఆమెపై తుపాకీ ఎక్కుపెట్టి బెదిరింపులకు దిగారు ఆ దుర్మార్గులు.. భయంతో వణికిపోతున్న ఆ మహిళపై అనంతరం అఘాయిత్యానికి పాల్పడి.. అక్కడి నుంచి పరారయ్యారు. కుటుంబసభ్యుల సహాయంతో మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Exit mobile version