Site icon NTV Telugu

Madyapradesh: ప్రభుత్వ ఉద్యోగం పోతుందని.. నవజాత శిశువును..

Untitled Design (8)

Untitled Design (8)

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో దారుణం చోటుచేసుకుంది. నవజాత శిశువును అతని తల్లిదండ్రులు అడవిలో వదిలేసారు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చింద్వారాలోని ఒక అడవిలో ఒక రాతి కింద నవజాత శిశువును అతని తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్లారు. తెల్లవారుజామున నందన్వాడి అడవిలో గ్రామస్తులు అతని కేకలు విన్నప్పుడు, వారు ఆ ప్రాంతానికి చేరుకుని రాయిని తొలగించారు. గ్రామస్తులు రక్తసిక్తంగా, వణుకుతున్న పసికందును, చర్మంపై చీమలు పాకి.. సజీవంగానే ఉన్నట్లు గుర్తించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడు బబ్లు దండోలియా , రాజకుమారి దండోలియా దంపతులకు నాల్గవ సంతానం కలిగిన శిశువును అడవిలో వదిలేసారు. ఎందుకంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారి ఉద్యోగం పోతుందని.. ఇక్కడి ప్రభుత్వ రూల్ ప్రకారం… ఈ నిర్ణయం తీసుకున్నామని శిశువు తల్లిదండ్రులు తెలిపారు. అప్పటికే ముగ్గురు పిల్లలు ఉండటంతో ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. సెప్టెంబర్ 23 తెల్లవారుజామున, రాజకుమారి మగబిడ్డకు జన్మనిచ్చింది, కొన్ని గంటల తర్వాత, వారు అతన్ని అడవికి తీసుకెళ్లి, చనిపోవడానికి ఒక రాయి కింద వదిలేశారు.

Exit mobile version