Hyderabad Crime: సహస్రను అత్యంత క్రూరంగా చంపేసిన బాలుడు.. మైనర్ కావడంతో ఇప్పుడు అతనిపైనే అందరి ఆలోచనలు సాగుతున్నాయి. అసలు ఓ మైనర్ బాలుడు అంత కిరాతకంగా హత్య చేస్తాడా? ఓ క్రికెట్ బ్యాట్ కోసం హత్య చేసే అంత ఎందుకు దిగజారిపోయాడు? దాని వెనుక కారణం ఏంటి? అసలు సహస్ర మృతి.. పోలీసులకే ఆశ్చర్యం కలిగించింది. అన్ని క్లూస్ సేకరించి.. నిందితున్ని పట్టుకున్న తర్వాత కూడా పోలీసులు షాక్ తిన్నారు. కేవలం చిన్న క్రికెట్ బ్యాట్ కోసం ..ఇంట్లోకి దూరి… సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడని తెలుసుని పరేషాన్ అయ్యారు. నిజానికి క్రికెట్ బ్యాట్ కోసం ఎవరైనా ఇంత దారుణంగా చంపేస్తారా అనే అనుమానం కూడా పోలీసులకు వచ్చింది. ఐతే పోలీసులు.. నిందితుడి కోణంలో నుంచి చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు.
READ ALSO: Ananya Pande : హెడ్ లైట్స్ బాలేవంటూ ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్..
నిజానికి సహస్ర మర్డర్ కేసులో బాలుడి క్రికెట్ బ్యాట్ కోరిక ఒక్కటే కారణం కాదు. అతని ఆలోచనా ధోరణి కూడా కారణమైందంటున్నారు పోలీసులు. స్కూలుకు వెళ్లకుండా ఉండడం.. నిత్యం ఇంట్లో ఖాళీగానే ఉంటూ OTTలో క్రైమ్ వెబ్ సిరీస్‌లు చూడడం.. వాటిలో ఉన్న విధంగా ఆలోచించడం లాంటివి కూడా అతనిపై తీవ్రంగా ప్రభావం చూపించాయని చెబుతున్నారు. బాలుడి కుటుంబానిది ప్రకాశం జిల్లా. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో అద్దెకు దిగారు. బాలుడి తల్లి హౌస్ కీపింగ్ సర్వీస్ చేస్తుంది. తండ్రి ఖాళీగానే ఉంటాడు. అప్పుడప్పుడు సినిమాలకు రివ్యూలు రాస్తుంటాడు. వాటితో వచ్చే ఆదాయమే వారికి జీవనోపాధిగా తెలుస్తోంది. ఐతే వారి ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓ ప్రైవేట్ స్కూలులో అక్కలతో కలిసి చదువుకుంటున్నాడు మైనర్ బాలుడు. ఐతే ఇటీవల తండ్రి ఫీజు కట్టకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఇంట్లో ఖాళీగా ఇంట్లో ఉంటూ క్రైమ్ వెబ్ సిరీస్‌లు చూసేవాడు. ఆ క్రమంలో వాటి ప్రభావం బాలుడిపై తీవ్రంగా పడిందంటున్నారు పోలీసులు. తనకు తెలియకుండానే నేర ప్రవృత్తి పెరిగిపోయి ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి ఓవర్‌గా రియాక్ట్ అయ్యేవాడని తల్లిదండ్రుల ద్వారా సమాచారం సేకరించారు పోలీసులు..
నేరపూరిత ఆలోచనల కారణంగానే.. దొంగతనం స్కెచ్ వేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే నెల రోజుల క్రితమే.. ఓ పేపర్ మీద దొంగతనం ఎలా చేయాలి? ఎలా తప్పించుకోవాలి? లాంటి అంశాలను రాసి పెట్టుకున్నాడు. అంతే కాదు.. దొంగతనం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉండే ఎల్పీజీ గ్యాస్ లీక్ చేసి రావాలనేది యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాసుకున్నాడు. నిజానికి ఎంతో కరడుగట్టిన దొంగలకు సైతం ఇలాంటి క్రిమినల్ సైకాలజీ ఉండదు. గ్యాస్ లీక్ చేయడం ద్వారా.. ఏదైనా ప్రమాదం జరిగితే ఆనవాళ్లు దొరకవు. పైగా దొంగతనం కేసు పక్కకు పోయి.. ప్రమాదం తెరమీదకు వస్తుంది. ఇదీ అతని ఆలోచన అని చెబుతున్నారు పోలీసులు. దీన్ని బట్టి అతని మైండ్ సెట్ ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చంటున్నారు… నిజానికి సహస్ర ఇంట్లో క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు.. గతంలో బాలుడు రాసుకున్న పేపర్‌కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు పోలీసులు. కానీ చోరీ చేయాలనే ఉద్దేశ్యం మాత్రం ఉందని వెల్లడించారు.
మైండ్ సెట్ చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు..
మరోవైపు మైనర్ బాలుడి మైండ్ సెట్ చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉంది.. నేరం ఆల్రెడీ చేసేశాడు. కానీ పోలీసులను చూసి ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తించాడంటున్నారు. కనీసం తమకు కూడా ఎక్కడా డౌట్ రాకుండా ప్రవర్తించాడని చెబుతున్నారు. అంతే కాదు పోలీసుల విచారణలో మరో విషయం కూడా వెలుగు చూసింది. నిజానికి మర్డర్ చేసి.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. బాలుడి ఇంట్లో వాళ్లు పెంచుకుంటున్న కుందేలు మృతి చెందింది. ఆ కుందేలు అంటే తనకు చాలా ఇష్టం. ఐతే దాన్ని తీసుకు వెళ్లి..ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో పాతి పెట్టి వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. అంటే ఓ వైపు తన కాలనీలో సహస్ర మర్డర్‌పై అంత హంగామా జరుగుతున్నా.. అవేమీ పట్టించుకోలేదు. నేరం తానే చేసినప్పటికీ బాలుడిలో మాత్రం ఎలాంటి చలనం లేదు. పోలీసులకు దొరికిపోతాననే భయం కానీ.. తనను జైలుకు పంపిస్తారనే ఊహ కూడా లేకుండా ప్రవర్తించాడు.
మొత్తంగా OTTల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు.. క్రైమ్ థ్రిల్లర్స్ వల్ల పిల్లలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే మెచ్యూరిటీ రాకముందే.. వారి లోపలు క్రిమినల్ థాట్స్ నాటుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు దీన్ని ఎప్పటికప్పుడు గమనించి, వారిని సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తేనే ఇది మారుతుందని చెబుతున్నారు. తద్వారా మున్ముందు మంచి సమాజాన్ని చూడగలగుతామంటున్నారు.
READ ALSO: Shocking murder: సహస్ర ఇంటిలోకి మైనర్ కిల్లర్ ఎందుకు వెళ్లాడు?
