Site icon NTV Telugu

Principal Assaults YouTuber: యూట్యూబర్ పై మహిళ ప్రిన్సిపాల్ దాడి…ఎందుకంటే…

Untitled Design (4)

Untitled Design (4)

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాలో యూట్యూబర్ పై మహిళ ప్రిన్సిపాల్ చెప్పుతో దాడి చేసింది. పైగా స్కూల్ ని వీడియో ఎందుకు షూట్ చేస్తున్నావంటూ అతడిపై తిరగబడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాలో వింతగా ప్రవర్తించింది ప్రిన్సిపాల్. హినోటి ఆజం ప్రాథమిక పాఠశాల హెడ్‌గా ఉన్న సోనా మారవి.. ఓ మేల్ యూట్యూబర్‌ను చెప్పుతో కొట్టింది. యూట్యూబర్ పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి ప్రశ్నించడంతో అతడిపై దాడికి తెగబడింది. ముందుగా స్కూల్‌లోకి ఎంటర్ అయిన యూట్యూబర్.. గేట్, స్కూల్ బయట, లోపల చిత్రీకరించాడు. తను చూసిన సమస్యల గురించి అడిగాడు. దీంతో కోపంతో వెంటనే చెప్పు తీసిన ఆమె.. యూట్యూబర్ పై తీవ్ర స్థాయిలో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి ఇలా దిగజారి ప్రవర్తించడమేంటని తిట్టి పోస్తున్నారు. ఆమెపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version