ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో మేక మేత విషయంలో జరిగిన వివాదం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఓ మహిళను పక్కింటి వారు కొట్టి చంపారు. మృతురాలి కుమార్తె పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉండడంతోనే తన తల్లి చనిపోయిందంటూ ఆరోపించింది.
Read Also:Floods: నేపాల్ లో భారీ వరదలు.. 22 మందికి పైగా మృతి..
పూర్తి వివరాల్లోకి వెళితే….నార్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న 55 ఏళ్ల రాణి దేవికి ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 2వ తేదీ రాత్రి, మేకలను మేపడం గురించి ఆమె తన పొరుగువాడైన సత్యంతో వాగ్వాదం జరిగింది. వివాదం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆమె తీవ్ర స్థాయిలో గాయాలు కావడంతో.. ఆమె కుమార్తె మౌసామి ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించి.. ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
Read Also:Farmer Wins 50 Lakh: కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో 50 లక్షలు గెలుచుకున్న రైతు
చికిత్స తర్వాత కుటుంబం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, సత్యంఅతని కుటుంబం మరుసటి రోజు ఉదయం వారిపై మళ్ళీ దాడి చేశారు. ఈసారి, నిందితులు రాణి దేవిని దారుణంగా కొట్టారు, ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.ఈ సంఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు ఉంచి పోలీసులపై నిరసన తెలిపారు. పోలీసులు ప్రాథమిక ఫిర్యాదుపై చర్య తీసుకుని ఉంటే తన తల్లి ప్రాణాలను కాపాడేవారని కుమార్తె మౌసమి ఆరోపించింది.
Read Also:Farrukhabad :కోచింగ్ సెంటర్‌లో భారీ పేలుడు.. 50 మీటర్ల దూరంలో మృతదేహం
ప్రాథమిక ఘర్షణకు సంబంధించి నివేదిక దాఖలు చేసినట్లు ఏసీపీ అభిషేక్ పాండే తెలిపారు. తరువాత, మహిళ మరణించడంతో, హత్య అభియోగం చేర్చబడింది. పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేసి, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
