Jabalpur Double Murder: మధ్యప్రదేశ్ జబల్పూర్ జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మైనర్ బాలిక, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తండ్రిని, 8 ఏళ్ల తమ్ముడిని దారుణంగా హత్య చేసింది. ప్రస్తుతం నిందితుడు ముకుల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ప్రియుడు ముకుల్ స్వయంగా పోలీసులు ముందు లొంగిపోయి, నేరాన్ని అంగీకరించడంతో ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ శుక్రవారం విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ హత్యలలో ముకుల్, మైనర్ బాలిక సమాన భాగస్వాములని ఎస్పీ తెలిపారు.
Read Also: Hyderabad: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అఖిల కేసులో ప్రియుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
రైల్వే ఉద్యోగి అయిన తండ్రి రాజ్‌కుమార్ విశ్వకర్మ, తమ్ముడుని హత్య చేసిన తర్వాత బాలిక తన ప్రియుడు ముకుల్‌తో కలిసి మూడు నెలల క్రితం పారిపోయింది. పారిపోయే ముందు తన అత్తకు ఫోన్ చేసి, ముకుల్ నాన్న, తమ్ముడిని చంపేశాడు అని చెప్పింది. ఆ తర్వాత నుంచి వీరిద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుల్‌తో తన కుమార్తె సంబంధం కలిగి ఉండటాన్ని విశ్వకర్మ వ్యతిరేకించాడు. వారి ప్రేమను అంగీకరించడకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
నేరాన్ని చేసే ముందు 8 ఏళ్ల తన తమ్ముడు, తన తండ్రిని హత్య చేయడం చూశాడు, దీంతో అతడిని కూడా చంపేశారు. నేరాన్ని దాచిపెట్టేందుకు వీరిద్దరు మృతదేహాలను ముక్కలుముక్కలుగా కోయాలని పథకం వేసినట్లు తేలింది. పోలీసులను నుంచి తప్పించుకునేందుకు 8 రాష్ట్రాల్లో పర్యటించారు. వారి వద్ద డబ్బు అయిపోయిన తర్వాత ఇద్దరు హరిద్వార్ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. అక్కడే వారిని పలువరు గుర్తించారు. ఈ జంట మార్చి 15న హత్య చేసి, అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. మే 29న హరిద్వార్ నుంచి మైనర్ బాలికను పోలీసులు అరెస్ట్ చేయగా, దీంతో భయపడిపోయిన ముకుల్ పోలీసుల ముందు లొంగిపోయాడు.
