Husband Tortures His Wife For Extramarital Affair In Uttar Pradesh: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి.. తన భార్య పట్ల కర్కశంగా వ్యవహరించాడు. ప్రియురాలి చేతిలో కీలుబొమ్మగా మారిన అతడు.. ఆమె చెప్పినట్లుగానే భార్యని చిత్రహింసలకు గురి చేశాడు. ప్రేమతో బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి మరి, కిరాతకంగా కొట్టేశాడు. మొదట్లో భర్త బాగోతం తెలియక భార్య అన్ని సహిస్తూ వచ్చింది. చివరికి తెరవెనుక మరో మహిళ ఉందన్న సంగతి తెలుసుకొని.. పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆగ్రాకు చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం రాబిన్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. తన భార్య, పిల్లలో రాబిన్ సంతోషంగానే ఉండేవాడు. భార్యని ప్రేమగా చూసుకునేవాడు. కానీ.. ఎప్పుడైతే రాబిన్ జీవితంలోకి మరో మహిళ వచ్చిందో, అప్పటి నుంచి అతడు విలన్‌లా మారాడు. ఆ మహిళ హరిపర్వత్‌కు చెందింది. భర్తకు విడాకులు ఇచ్చి, కొంతకాలం నుంచి ఒంటరిగానే ఉంటోంది. ఈమెకు, రాబిన్‌కు అనుకోకుండా పరిచయం ఏర్పడగా.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పి నుంచి.. రాబిన్ తన భార్య దగ్గరకు వెళ్లడం తగ్గించేశాడు. ప్రేమ చూపించడం కాదు కదా, కనీసం సరిగ్గా పలకరించేవాడు కూడా కాదు! అతడు పూర్తిగా ఆ మహిళకు లొంగిపోయాడు. ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా ఉండేవాడు.
రాబిన్ టోటల్‌గా తన కంట్రోల్‌లోకి రావడంతో.. ఆ మహిళ అతడ్ని ఆడించడం మొదలుపెట్టింది. భార్య దగ్గరకు వెళ్లినప్పుడు.. వీడియో కాల్ చేసి, భార్యని కొట్టమని చెప్పేది. ఆమె చెప్పినట్టుగానే.. రాబిన్ తన భార్యని బెడ్‌రూంలోకి తీసుకెళ్లి, వీడియో కాల్ చేసి, ఆ ఫోన్ కనిపించకుండా ఒక చోట దాచి, భార్యని కొట్టేవాడు. రాబిన్ అలా కొట్టడం చూసి.. ఆ మహిళ పైశాచికానందం పొందేది. చివరికి భర్త వివాహేతర సంబంధం గురించి భార్యకు తెలిశాక.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, ఆమె తల్లి కలిసి.. యువకుల్ని మభ్యపెట్టి, డబ్బులు గుంజుకుంటారని తేలింది.
