హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కనీసం మిగిలినిపోయిన బిర్యానీ అయిన తిని పొట్ట నింపుకుందామని భావించిన ఓ వలస కార్మికుడి.. ఓ హోటల్‌కు వెళ్లాడు.. అయితే, దొంగగా భావించిన హోటల్ సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో ఆ వ్యక్తి మృతిచెందాడు.. కూకట్‌పల్లిలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒడిశాకు చెందిన రాజేష్ అనే కార్మికుడు భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్‌లో ఉంటూ ప్రగతినగర్‌లో భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు.. అయితే, బుధవారం రాత్రి పని ప్రాంతం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో జేఎన్‌టీయూహెచ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ దగ్గరకు వెళ్లాడు.. ఆ రెస్టారెంట్ సెల్లర్‌లోకి వెళ్లి.. మిగిలిన బిర్యానీని ఏరుకునే ప్రయత్నం చేశాడు.. అయితే.. సిబ్బంది అడ్డుకోవడంతో.. తినగా మిగిలింది ఏమైనా ఉంటే ఇవ్వాలని ప్రాదేయపడ్డాడు.. కానీ, దొంగగా పొరబడి హోటల్ సిబ్బంది.. అతడిని తీవ్రంగా కొట్టి వెళ్లిపోయారు.. దీంతో.. స్పృహతప్పి అక్కడే పడిపోయాడు రాజేష్.. ఇక, మరుసటి రోజు ఉదయం రాజేష్ అక్కడే ఉండడాన్ని గుర్తించిన సిబ్బంది.. అతడి తండ్రికి సమాచారం ఇచ్చారు.. అతడు ఒడిశా నుంచి బాధితుడి భార్యకు విషయం చేరవేయడంతో.. ఘటనా స్థలానికి వెళ్లిన ఆమె.. భర్తను ఇంటికి తీసుకెళ్లింది.. కానీ, కాసేపటికే రాజేష్ కన్నుమూశాడని.. ఆ తర్వాత తమకు ఫిర్యాదు చేశారని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
