Chemical Attack : హనుమకొండలో ఘోరం చోటుచేసుకుంది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి పై గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ దాడికి పాల్పడటం ప్రాంతంలో కలకలం రేపింది. జనగాం జిల్లా జఫరఘడ్ మండలానికి చెందిన ఆ విద్యార్థిని హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం ఉదయం, కాజీపేట కడిపికొండ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపై అకస్మాత్తుగా కెమికల్ చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాడి జరిగిన వెంటనే విద్యార్థిని తీవ్ర నొప్పితో కేకలు వేయగా, స్థానికులు సహాయం చేసి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె కళ్లకు, ముఖానికి గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Putin India visit 2025: భారత్ లో పుతిన్ పర్యటన.. పాకిస్తాన్, చైనాకు వణుకు పుట్టేలా కీలక ఒప్పందాలు
సమాచారం అందుకున్న కాజీపేట ఏసీపీ, స్థానిక పోలీసులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి వద్ద వివరాలు సేకరించారు. దాడి సమయంలో కెమికల్ పొంగిపడడంతో అది తనపై పడిందని ఆమె పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదవశాత్తా జరిగిందా, లేక పూర్వ వైరం కారణమా అన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజీ సహా ఆధారాలను సేకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో ఇలా దాడి జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
Telangana: తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఫైర్ !
