AP Crime: అతనో ప్రభుత్వ ఉద్యోగి.. డ్యూటీ దిగిన తర్వాత దొంగతనాలు..!

Government Employee Arreste

Government Employee Arreste

AP Crime: పేరుకు అతనో ప్రభుత్వ ఉద్యోగి.. కానీ, డ్యూటీ దిగిన తర్వాత దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిక్కుళ్లగూడెంలో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు.. ఈ చైన్‌ స్నాచింగ్‌ కేసులో నిందితుడైన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అని తెలిసి అంతా షాక్‌ తిన్నారు.. వృద్ధురాలైన ఉప్పు అనసూయ మెడలో 40 గ్రాముల బంగారు చైన్‌ ఎత్తుకెళ్లాడు నంద సుభాష్‌ అనే వ్యక్తి.. ఈ కేసులో నిందితుడైన నంద సుభాష్.. విజయవాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి (అసిస్టెంట్ లైన్‌మన్‌)గా గుర్తించారు.. అదేవిధంగా దొంగతనానికి ఉపయోగించిన బైక్ గానుగపాడు గ్రామంలో కొట్టేసినట్టు తేల్చారు.. ఉద్యోగం చేస్తూ చెడు వ్యసనాలకు బానిసైన నంద సుభాష్.. దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. నిందితుడిని లక్ష్మీపురం శివారులో అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు సీఐ కే.గిరిబాబు.. ఈ సమావేశంలో ఎస్సై రాజు, ఐడి పార్టీ కానిస్టేబుల్ షేక్ ఖాసిం పాల్గొన్నారు.. అయితే, నంద సుభాష్‌ను అరెస్ట్‌ చేయడంతో పాటు.. అతన వద్ద నుంచి బంగారంతో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..

Read Also: Rat Poison on Fruits: షాకింగ్‌.. ఫ్రూట్స్‌ కొనుగోలు చేస్తున్నారా? జాగ్రత్త వాటిపై ఎలుకల మందు పూస్తున్నారు..!