FMS Hospital Nurse Theft Diamong Ring Worth 50 Lakhs In Hyderabad: హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది చేతివాటం ప్రదర్శించింది. 10 కాదు, 20 కాదు.. రూ.50 లక్షలు విలువ చేసే ఓ డైమండ్ రింగ్‌ని చోరీ చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు బిల్డప్ ఇచ్చింది. చివరికి.. పోలీసులు రంగంలోకి దిగడంతో, ఆసుపత్రి సిబ్బంది ప్లేటు ఫిరాయించింది. ఒక పెద్ద డ్రామాకే తెరతీసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లోని ఎఫ్ఎంఎస్ దంత, చర్మ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ హాట్ కామెంట్లు.. నేను అర్హుడిని కాదా..?
ఈనెల 27వ తేదీన బంజారాహిల్స్‌కు చెందిన ఒక మహిళ చికిత్స కోసం ఎఫ్ఎంఎస్ ఆసుపత్రికి వచ్చింది. చికిత్స సమయంలో.. తన చేతికి ఉన్న రూ.50 లక్షల డైమండ్ రింగ్‌ను తీసి, పక్కన పెట్టింది. చికిత్స అనంతరం ఆ మహిళ ఉంగరం విషయం మరిచిపోయి, ఇంటికి వెళ్లిపోయింది. ఆలస్యంగా ఉంగరం విషయం గుర్తుకొచ్చి, తిరిగి ఆసుపత్రికి వెళ్లింది. తాను చికిత్స సమయంలో ఉంగరం తీశానని, ఇక్కడే మర్చిపోయి వెళ్లానని సిబ్బందికి చెప్పింది. అది ఎక్కడుందో వెతికి పెట్టాలని కోరింది. కానీ.. సిబ్బంది నుండి ఎలాంటి స్పందన లేదు. తమకు ఉంగరం సంగతి తెలియదన్నట్టుగా వాళ్లు వ్యవహరించారు. దీంతో కోపాద్రిక్తురాలైన ఆ మహిళ.. ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీసింది.
Dowry Harassment: పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..
అప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో.. ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణలో భాగంగా సీసి కెమెరాలను తనిఖీ చేశారు. అప్పుడు లాలస యువతి బ్యాగ్‌లో ఆ ఉంగరం ఉన్నట్టు గమనించారు. ఆమెని నిలదీయగా.. ఎవరో టిష్యూ పేపర్‌లో ఆ ఉంగరాన్ని చుట్టి, తన పర్స్‌లో పెట్టారని చెప్పింది. తాను భయంతో బాత్‌రూమ్ కమోడ్‌లో పడేశానని తెలిపింది. ఆ నర్సు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు బాత్రూం తవ్వి, ఉంగరాన్ని వెలికి తీశారు. లాలసని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.