Site icon NTV Telugu

Drugs: హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ అరెస్ట్

Drugs

Drugs

హైదరాబాద్‌ సిటీలో డ్రగ్స్ సరఫరా ఆందోళనకు గురిచేస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఈ సమస్య పోలీసులకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా సిటీలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుండగా భరత్ అనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్‌ను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో అంబర్ పేటలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 15 గ్రాముల ఎండిఎంఎ స్వాధీన పరుచుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సిటీలో భరత్ డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ, ముంబై, గోవాలాంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు వెల్లడించారు. అలాగే భరత్ నుంచి మాదక ద్రవ్యాలు చేసే ఆరుగురు కస్టమర్లను పోలీలుసు గుర్తించారు. భరత్ 2020లోనే ఎక్సైజ్ అధికారుల చేతికి చిక్కి అరెస్టయ్యాడు. అతిపెద్ద డ్రగ్ మాఫియాను అతడు నడుపుతున్నట్లు తెలుసుకున్నారు. అతడి నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.

Exit mobile version