Site icon NTV Telugu

Shocking Crime: స్నేహితుడితో చూడకూడని స్థితిలో భార్య.. మరణశాసనం రాసిన భర్త..

Bihar Murder

Bihar Murder

Shocking Crime: బిహార్‌లోని మాధేపురాలో ఓ భర్త రాసిన మరణశాసనం చర్చనీయాంశమైంది. తన స్నేహితుడితో భార్యను చూడకూడదని స్థితిలో చూసిన తర్వాత ఆ భర్త రెండే వేటుల్లో మరణశాసనం లిఖించాడు. ఇంతకీ ఆయన దాడిలో చనిపోయింది ఎవరూ.. భార్య, స్నేహితుడా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Back Pain: నడుం నొప్పి వేధిస్తోందా? ఈ చిన్న చిట్కా పాటించండి..

రెండే వేటుల్లో ఖతం చేశాడు..
భట్ని పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బర్కుర్వా వార్డ్ -12 లో నివసిస్తున్న అనిల్ యాదవ్ కుమారుడు రాజీవ్ కుమార్ (17)ను గురువారం తన స్నేహితుడి విజయ్ కుమార్ హత్య చేశాడు. ఈసందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గురువారం రాత్రి 10 గంటలకు విజయ్ మోటారు వైర్లను కనెక్ట్ చేసే నెపంతో రాజీవ్‌ను తన ఇంటికి తీసుకెళ్లాడని చెప్పారు. ఆ తర్వాత రాజీవ్‌ను విజయ్ తన ఇంట్లోనే హత్య చేశారని పేర్కొన్నారు.

మృతుడికి తన స్నేహితుడు విజయ్ భార్యతో అక్రమ సంబంధం ఉందని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. నిందితుడు విజయ్ తన ఇంట్లో మోటారు మరమ్మతు చేయాలనే నెపంతో రాజీవ్‌ను ఇంటికి పిలిపించాడు. అప్పుడు అతని ఇంట్లో మద్యం పార్టీ జరిగింది. ఆ రోజు రాత్రి రాజీవ్.. విజయ్ ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి విజయ్ నిద్రపోయిన తర్వాత, అతని భార్య రాజీవ్ వద్దకు వచ్చింది. దీనిని చూసిన విజయ్.. కోపంతో పదునైన కత్తితో రాజీవ్‌పై దాడి చేశాడు.

మొదటి వేటులో రాజీవ్ చెవి తెగిపోయింది. తరువాత రెండవ వేటులో అతని మెడ తెగిపోయి అక్కడికక్కడే మరణించాడు. విజయ్ రాజీవ్ మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ASP ప్రవేంద్ర భారతి మాట్లాడుతూ.. పారిపోయిన నిందితుడు విజయ్‌ను కొన్ని గంటల్లోనే అరెస్టు చేసినట్లు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

READ ALSO: Brazilian Billionaire: ఇది మామూలు ప్రేమ కాదు.. రూ.10 వేల కోట్లకు అధిపతిని చేశాడు..!

Exit mobile version