ఏపీలో రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచార ఘటనలు, హత్యలు పెచ్చుమీరిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా బాపట్ల జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని వేమూరు మండలం చావలి గ్రామంలో వాలంటీర్‌గా పని చేస్తోన్న శారద అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందని పద్మారావు అనే వ్యక్తి ఆమెను హతమార్చాడు.
కొన్నాళ్ళ క్రితం శారద, పద్మారావుకి ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. కొంతకాలం నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే మరోసారి ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా.. కోపాద్రిక్తుడైన పద్మారావు ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
