Vizag Crime: ఫోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని విశాఖ టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.. 2014 లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్ కేసులో మహమ్మద్ సల్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. అల్లిపురానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో రిమాండ్ కు తరలించారు.. కొద్ది రోజుల తర్వాత కండీషన్ బెయిల్ పై బయటకు వచ్చి అప్పటి నుండి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.. ఈ క్రమంలో విశాఖపట్నం వదిలి ఉత్తరప్రదేశ్ కు పారిపోయాడు.. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు విశాఖ పోలీస్ కమిషనర్ సూచనలు మేరకు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ట్రేస్ చేశారు.. ఉత్తరప్రదేశ్ కు టీమ్ ను పంపించి అక్కడ ముద్దాయి ఆచూకీ కనుగొన్నారు.. బలరాంపుర్ నుండి విశాఖకు తీసుకొచ్చారు.. పోలీసుల కళ్లు కప్పి 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్ కు తరలించారు.
Read Also: Operation Sindoor: భారత ఎయిర్‌ఫోర్స్ దాడులతో పాకిస్తాన్ వణికింది: అంతర్జాతీయ సంస్థ..
