Site icon NTV Telugu

సీఎంకు లేఖ రాసి రైతు ఆత్మహత్య

రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ప్రకృతి విపత్తులు, నకీలీ పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పులు వెరసి రైతుల ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. తాజాగా మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని, ఇంజనీరింగ్‌ చేసిన కుమారుడికి ఉద్యోగం లేకపోవడంతో బాధపడిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లాల హవేలి ఘనపూర్‌ మండలంల బొగుడ భూపతిపూర్‌లో చోటు చేసుకుంది.

మృతుడు కరణం రవికుమార్‌ (40)గా పోలీసలు గుర్తించారు. ఘటన స్థలి వద్ద సీఎం కేసీఆర్‌కు మృతుడు రవి రాసినట్లు ఉన్న ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఇంజనీరింగ్‌ చేసిన కొడుకు ఉద్యోగం రాలేదు. 60 ఏళ్లు నిండిన తన తండ్రికి ఫించన్‌ రాలేదు. పండించిన సన్నరకం ధాన్యానికి మద్ధతు ధర రాలేదని రవి పేర్కొన్నారు. రవి మరణంతో ఆ ప్రాంతమంతా విషాద చాయలు అలుముకున్నాయి.

Exit mobile version