4 Thieves Molested A Woman In Rajasthan: రాజస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన దొంగలు.. భర్తను బంధించి, అతని కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దొంగతానికి వెళ్లిన ఇంట్లో విలువైన వస్తువులు, భారీ నగదు దొరక్కపోవడం వల్లే.. ఆ దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్‌లోని సీరోహీ జిల్లాలో నివాసం ఉంటోన్న ఓ దంపతుల ఇంట్లోకి ఇటీవల నలుగురు దొంగలు చొరబడ్డారు. తొలుత ఆ దొంగలు దంపతుల్ని బందీగా చేసుకున్నారు. అనంతరం ఇంట్లో డబ్బులు, నగలు, విలువైల వస్తువుల కోసం వెతికారు. కానీ.. వాళ్లకు ఏమీ దొరకలేదు. దీంతో.. బందీ చేసిన ఆ దంపతుల్ని, తమకు డబ్బు ఇవ్వాలని అడిగారు. అప్పుడు వారి వద్ద ఉన్న రూ. 1400 నగదు ఇచ్చారు.
తమకు మరింత డబ్బు కావాలని, ఈ రూ. 1400 తమకేమీ సరిపోవని కోపంతో అడిగారు. అయితే.. ఆ దంపతులు తమ వద్ద ఏమీ లేదని, మీరు అనుకున్నట్టు తామేమీ సంపన్నులం కామని తిరిగి సమాధానం ఇచ్చారు. ఆ దొంగలు చంపేస్తామని బెదిరించినా.. నిజంగా తమ దగ్గర ఏమీ లేదని, తమని విడిచిపెట్టమని వేడుకున్నారు. కానీ, ఆ దొంగలు కనికరించకుండా, మరింత రెచ్చిపోయారు. భర్తను బంధించి, అతని ముందే భార్యపై సామూహిత అత్యాచారం చేశారు. ఈ ఘటనతో ఖంగుతిన్న భార్యాభర్తలు.. రెండు రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అనంతరం, పోలీసుల్ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, దర్యాఫ్తు చేపట్టారు. నిందితుల కోసం గాలించగా.. ముగ్గురు దొరికారు. నాలుగో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. బాధితురాలి భర్త వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు.
