3 Doctors Booked For Molesting Woman In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను నమ్మించి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కీచక డాక్టర్. మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాను ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ సదర్ కోత్వాల్ ప్రాంతంలో ఒక ఆసుపత్రి పెట్టినట్టు ఓ డాక్టర్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అది చూసిన ఓ మహిళ.. ఆరోగ్యపరమైన సలహాలు తీసుకోవచ్చన్న ఉద్దేశంతో, సోషల్ మీడియా ద్వారా అతనితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత వ్యక్తిగతంగానూ కొన్నిసార్లు కలిసిన వాళ్లిద్దరు.. కొన్నాళ్లకు స్నేహితులుగా మారారు.
కట్ చేస్తే.. రీసెంట్‌గా సదరు డాక్టర్ కలవాలని ఉందంటూ ఆ మహిళను తన ఆస్పత్రికి ఆహ్వానించాడు. ఎలాగో ఫ్రెండ్ అయ్యారు కాబట్టి, ఏదో పని మీద పిలిచి ఉంటాడులే అనుకొని ఆమె ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ కాసేపు ముచ్చటించారు. అనంతరం సదరు డాక్టర్ ఆమెను హాస్టల్ రూమ్‌కి తీసుకెళ్లాడు. అయితే.. ఆ హాస్టల్ రూమ్‌లో ఆల్రెడీ మరో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. అప్పటికే అనుమానం వచ్చిన సదరు మహిళ, అక్కడి నుంచి బయట పడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ ముగ్గురు కీచకలు ఒకేసారి ఆమె మీద రాక్షసుల్లా ఎగబడ్డారు. ఆమెను బయటకు వెళ్లనివ్వకుండా, లోపలే బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరించి ఆమెను పంపించేశారు.
ఈ ఘటనతో కుంగిపోయిన సదరు మహిళ.. అక్కడి నుంచి నేరుగా లక్నో చేరుకొని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితుడే కదా అతడ్ని నమ్మి హాస్టల్‌కి వెళ్తే, సహచర డాక్టర్లతో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, సదరు వైడ్యుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. బాధితురాలు ఒక ప్రైవేట్ స్కూల్‌గా టీచర్‌గా పని చేస్తోంది.
