NTV Telugu Site icon

Zomato Orders 2023: వామ్మో.. 2023 లో అన్ని కోట్లకు నూడిల్స్‌ను ఆర్డర్‌ చేశారా?

Zomato (2)

Zomato (2)

ఈ ఏడాది దాదాపు ముగింపుకు చేరుకుంది..అయితే ఒక్కో సంస్థ తమ కస్టమర్ల రివ్యూ గురించి చెబుతున్నారు.. ఈ క్రమంలో ఫుడ్‌ డెలివరీ సంస్థ ఏడాది మొత్తం మీద ఏ ఫుడ్‌ ఐటమ్‌ను ఎక్కువగా డెలివరీ చేశామని విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇటలీలో పుట్టిన పిజ్జా భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార వంటకంగా ప్రసిద్ధికెక్కుతోంది. ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలలో బిర్యానీ, పిజ్జాలు వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి…

ఈ ఏడాది కూడా అత్యధికంగా బిర్యాని ఉంది.. ఏకంగా రూ.10.09 కోట్ల బిర్యానీల కోసం ఆర్డర్‌ పెట్టుకుంటే, రెండో స్థానంలో ఉన్న పిజ్జాను 7.45 కోట్ల ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో తెలిపింది.. ఇక మూడో స్థానంలో రూ. 4.55 కోట్ల నూడిల్స్‌ ఆర్డర్‌ పెట్టారు.. ఇక బెంగుళూరు లో స్విగ్గిలో కేకులు ఎక్కువగా ఆర్డర్ చెయ్యగా, జోమాటో లో బ్రేక్‌ ఫాస్ట్‌ను ఆర్డర్‌ పెట్టుకోగా, ఢిల్లీకి చెందిన వినియోగదారులు ఎక్కువ మంది అర్ధరాత్రి ఆర్డర్‌ చేసుకున్నారు.. ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. బెంగళూరు నుంచి ఫుడ్‌ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క ఆర్డర్‌ ఖరీదు అక్షరాల రూ.46,273. అదే సమయంలో రూ.6.6లక్షల విలువ చేసే 1389 గిఫ్ట్‌ ఆర్డర్‌లు పెట్టారు. ఆ తర్వాత ముంబై వాసులు ఒక్కరోజే 121 ఆర్డర్‌లు పెట్టారు..

గత 8 ఏళ్లుగా బిర్యాని రికార్డు తగ్గలేదు.. స్విగ్గీలో ఎక్కువ బిర్యానీ ఆర్డర్‌ పెట్టినట్లు ఆ సంస్థ తన ఇయర్‌ ఎండర్‌ 2023 రిపోర్ట్‌లో తెలిపింది..ప్రతి సెకండ్‌కు 2.5 బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్‌ పెట్టారు. వారిలో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఏడాది మొత్తం మీద 1633 బిర్యానీ ఆర్డర్‌లు పెట్టాడు. దీంతో బిర్యానీని ఎక్కువగా తినే ఫుడీల జాబితాలో హైదారబాద్‌ వాసులు నిలిచారు. స్విగ్గీ ఆర్డర్‌లో ప్రతి 6వ ఆర్డర్‌ ఇక్కడే నుంచే రావడం గమనార్హం.. అలాగే ముంబైకి చెందిన ఫుడ్ లవర్స్ ఏకంగా రూ.43 లక్షల ఆర్డర్స్ ను చేసినట్లు తెలుస్తుంది…