Virat Kohli One8 Shoes: సినీ స్టార్స్ అయినా.. స్పోర్ట్స్ స్టార్స్ అయినా.. వారికి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.. ప్రత్యేకంగా వారు ధరించే బ్రాండ్స్‌ను కొనుగోలు చేయడానికి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం చూపిస్తారు.. ఇక, కింగ్ కోహ్లీ.. ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రాండ్ ‘వన్8’ తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే సుమారు 1.5 లక్షల జతల షూస్ అమ్ముడవడంతో ఈ బ్రాండ్‌పై ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా యువత నుంచి భారీ స్పందన లభించడంతో పలు నగరాల్లోని షోరూమ్‌ల వద్ద కొనుగోలుదారుల రద్దీ కనిపించింది.
విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ ఫ్యాషన్ ప్రేమికులు కూడా ఈ షూస్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోషల్ మీడియాలో వన్8 షూస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా, పలువురు తమ వద్ద కూడా కోహ్లీ బ్రాండ్ షూస్ ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. కొందరు అభిమానులు సరదాగా “ఈ షూస్‌ను మాకు గిఫ్ట్‌గా ఇవ్వండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక, ఈ షూస్ ధర రూ.9,230గా నిర్ణయించారు. ఆసక్తికరంగా, కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో చేసిన పరుగుల సంఖ్యకు అనుగుణంగా ఈ ధరను నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. స్టైలిష్ డిజైన్, స్పోర్ట్స్ లుక్, కోహ్లీ బ్రాండ్ ఇమేజ్ కలిసి ఈ ఉత్పత్తిని మార్కెట్లో హాట్ టాపిక్‌గా మార్చాయి. గతంలో ప్యూమాతో కలిసి ‘వన్8’ బ్రాండ్‌ను ప్రారంభించిన కోహ్లీ, అనంతరం తన సొంత బ్రాండ్‌ను మరింత విస్తరించేందుకు ప్రత్యేకంగా అడుగులు వేశాడు. నివేదికల ప్రకారం, ప్యూమా ఇండియా మాజీ మేనేజ్‌మెంట్‌తో కలిసి వన్8 ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. బ్రాండ్‌కు కోహ్లీయే ప్రధాన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.
కేవలం ఒకే రోజులో భారీ అమ్మకాలు నమోదు కావడంతో వన్8 బ్రాండ్ వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ ప్రభావం క్రీడలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ ఎంత బలంగా ఉందో ఈ అమ్మకాలు నిరూపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ, పూమా ఇండియా మాజీ ఎండీ సహకారంతో ‘వన్8’ అనే తన బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను ప్రారంభించాడు. ఈ కంపెనీ బ్రాండ్ మరియు ఉత్పత్తులకు విరాట్ కోహ్లీయే ప్రచారకర్త. కేవలం 24 గంటల్లోనే విరాట్ ఉత్పత్తులు రూ.140 కోట్లు ఆర్జించడం విశేషంగా చెప్పుకోవాలి..

