Site icon NTV Telugu

కార్ల అమ్మ‌కాల్లో కొత్త రికార్డు.. ఏడాదిలో కోటిపైగా విక్ర‌యం..

క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌తో పాటు ఆటోమొబైల్ రంగంపై కూడా తీవ్ర ప్ర‌భావాన్నే చూపింది.. అన్ని సంస్థ‌ల కార్ల విక్ర‌యాలు మంద‌గించాయి.. మ‌రోవైపు.. దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలను సైతం చిప్‌ కొరత, సప్లై చైన్‌ రంగం తీవ్రంగా దెబ్బ కొట్టాయి.. ఇవ‌న్నీ ప్ర‌తికూలంగా మారిపోయి.. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా ప‌డిపోయిన ప‌రిస్థితి.. కానీ, ఇదే స‌మ‌యంలో కోటిపైగా కార్ల‌ను విక్ర‌యించింది రిక్డాకెక్కింది జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా..

Read Also: ఇండియ‌న్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఆ దేశం… ఇక నిబంధ‌న‌లు లేవు..!

2021 ఏడాదిలో త‌మ వాహ‌న విక్ర‌యాలు గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని ప్ర‌క‌టించింది.. 2021లో 10.1 శాతం విక్ర‌యాలు పెరిగిన‌ట్టు పేర్కొంది.. దీంతో.. వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించి రికార్డు సృష్టించింది టయోటా.. త‌న అనుబంధ సంస్థలైన డైహట్సు మోటార్స్ , హినో మోటార్స్‌తో సహా గ‌త ఏడాదిలో 10.5 మిలియన్(కోటీకిపైగా) వాహనాల అమ్మకాలు జరిపినట్లు వెల్ల‌డించింది.. మ‌రోవైపు ఫోక్స్ వ్యాగ‌న్ విక్ర‌యాలు మంద‌గించాయి.. 2020తో పోల్చితే 2021లో అమ్మకాల సంఖ్య భారీగా త‌గ్గిపోయింది.. 5 శాతం తక్కువ అమ్మకాలను న‌మోదు చేసింది.. గ‌త ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్‌ కేవలం 8.9 మిలియన్ల కార్లను మిత్ర‌మే విక్ర‌యించింది.. గత 10 ఏళ్ల‌లో ఫోక్స్‌వ్యాగ‌న్ విక్ర‌యాలు ఇవే అత్యల్పం కావ‌డం గ‌మ‌నించ‌ద‌గిన ప‌ర‌ణామం..

Exit mobile version