Site icon NTV Telugu

Today Business Headlines (10-01-2023) : ప్రపంచంలో ఫస్ట్ సెల్ఫ్ బ్యాలెన్స్ స్కూటర్

Self Balanced Scooter

Self Balanced Scooter

తెలంగాణ ఐటీ ఎగుమతులు 3 రెట్లు

8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర IT ఎగుమతులు 3 రెట్లు పెరిగాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎగుమతుల విలువ 57 వేల కోట్ల రూపాయల నుంచి ఒకటీ పాయింట్ ఎనిమిదీ మూడు లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. తెలంగాణ వైపు చూస్తున్న సంస్థలు మరియు ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. 2014లో IT ఉద్యోగుల సంఖ్య 3 లక్షల 23 వేలు మాత్రమేనని, ఇప్పుడు 8 లక్షల 70 వేలకు పెరిగిందని మంత్రి కేటీఆర్ వివరించారు.

తెలంగాణలో ఉజ్జీవన్ బ్యాంక్ విస్తరణ

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. ముందుగా తెలంగాణలో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘ఆంధ్రప్రదేశ్’లో ‘బ్రాంచ్’లను ఓపెన్ చేయనుంది. తెలంగాణలో తొలుత హైదరాబాదులో 4 శాఖలను అందుబాటులోకి తేనుంది. ఈ బ్యాంక్ ప్రస్తుతం 24 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 598 ‘బ్రంచ్’లను కలిగి ఉంది. ఈ శాఖల ద్వారా 71 లక్షల మందికి సర్వీస్ అందిస్తోంది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం సైజ్ ‘ఎంటర్-ప్రైజ్’లకు లోన్లు ఇస్తోంది.

ప్రపంచంలో ఫస్ట్ సెల్ఫ్ బ్యాలెన్స్ స్కూటర్

గ్రేటర్ నోయిడాలో ఈ నెల 13 నుంచి 18 వరకు జరగనున్న Auto Expoలో.. ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటరును ఆవిష్కరించనున్నారు. ముంబైకి చెందిన లైగర్ మొబిలిటీ అనే స్టార్టప్ ఈ వాహనాన్ని ప్రదర్శించనుంది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఇ-స్కూటరుకు సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ ‘మోడల్’ను ఈ సంస్థ 2019లో షోకేజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ద్విచక్ర వాహనంలో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది. OTA ‘అప్డేట్స్’తో కూడిన డిజిటల్ క్లస్టర్ అమర్చారు. సెల్ఫ్ పార్కింగ్ మరియు అడ్వాన్సుడ్ రైడర్ సేఫ్టీ అసిస్టెంట్, లెర్నర్ మోడ్, రివర్స్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది.

11 శాతం పెరిగిన టీసీఎస్ లాభం

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ అయిన TCS ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన Q3 ఫలితాలను వెల్లడించింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్.. ఈ 3 నెలల్లో 10 వేల 846 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో 9 వేల 769 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది. దీంతో పోల్చితే ఈసారి నికర లాభం 11 శాతం పెరిగింది. మొత్తం ఆదాయంలో 19 శాతానికి పైగా గ్రోత్ నమోదైంది. 48 వేల 885 కోట్ల రూపాయల నుంచి 58 వేల 229 కోట్ల రూపాయలకు చేరింది.

స్టార్టప్ ఫండింగులో బెంగళూర్ టాప్

2022వ సంవత్సరంలో స్టార్టప్స్ ఫండింగుకు సంబంధించి బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. 10 పాయింట్ 8 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించగలిగింది. 3 పాయింట్ 9 బిలియన్ డాలర్లతో ముంబై రెండో స్థానంలో ఉంది. 2 పాయింట్ 6 బిలియన్ డాలర్ల ఫండింగుతో గురుగ్రామ్ మూడో ర్యాంక్ సొంతం చేసుకుంది. 2021తో పోల్చితే ఈసారి ఈ నగరాల స్టార్టర్స్ సేకరించిన నిధులు దాదాపు సగానికి సగం తగ్గిపోయాయి. 2021లో యూనికార్నుల సంఖ్య 46గా నమోదు కాగా 2022లో 22కి తగ్గిపోయాయి.

యూపీఐ పట్ల 3, 4 దేశాల ఆసక్తి

ఇండియాలో ఆన్ లైన్ ‘పేమెంట్స్’లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్.. UPI.. సరికొత్త విప్లవం తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చెల్లింపు విధానంపై ఇప్పుడు మూడు నాలుగు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా MD అండ్ CEO దిలీప్ అస్బే తెలిపారు. అయితే.. ఆ దేశాలు UPIలో సైనప్ కావటానికి ఇంకా ఏడాది సమయం పడుతుందని చెప్పారు. UPIని అనుసరించే దేశాలకు అన్ని విధాలా సాయం చేసేందుకు NPCI ఏడాదిన్నర కిందట ‘NPCI ఇంటర్నేషనల్’ను ఏర్పాటుచేసింది.

Exit mobile version