Site icon NTV Telugu

టిక్‌టాక్‌ సరికొత్త రికార్డు.. వెనకబడ్డ ఫేస్‌బుక్‌

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ నిలిచింది. ఇదివరకు నెంబ‌ర్. 1 గా వున్న ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ అధిగ‌మించింది. ఒక్క‌సారిగా టిక్‌టాక్ గ్లోబ‌ల్ మార్కెట్‌లో పుంజుకొని ఫేస్‌బుక్ మార్కెట్‌ను దెబ్బ‌తీసింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్‌ జర్నల్‌ నిక్కీ ఏషియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ త‌న మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. అయితే.. ఇండియాలో గ‌త సంవ‌త్స‌రం జూన్ నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య సుమారు చైనాకు చెందిన సుమారు 200 యాప్‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం నిషేధించింది. అందులో టిక్‌టాక్ కూడా వున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌ లాంటి దేశాల్లో టిక్‌టాక్ నిషేధానికి గురైన కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ నిలవడం విశేషం.

Exit mobile version