అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్‌ను తీవ్ర అల్లకల్లోలం చేసింది. ఎన్నడూ లేని విధంగా భారీ నష్టాలను చవిచూసింది. సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా మరింత దిగజారిపోయి భారీ స్థాయిలో నష్టాలను చవిచూసింది. పెట్టుబడిదారుల సంపద రూ.18 లక్షల కోట్లు ఆవిరైపోయింది. సెన్సెక్స్ 2,222 పాయింట్లు నష్టపోయి 78, 759 దగ్గర ముగియగా.. నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయి 24, 055 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Bangladesh PM Resign: బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా.. ఆర్మీ చేతుల్లోకి పాలన..!
నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, హిందాల్కో, టాటా స్టీల్ ఉండగా… హెచ్‌యూఎల్, నెస్లే, టాటా కన్స్యూమర్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభపడ్డాయి. ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, మీడియా, రియల్టీ 4 శాతం చొప్పున క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.2 శాతం క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Sheikh Hasina: ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఎక్కడికి వెళ్ళిపోయారు..?