Site icon NTV Telugu

TCS Bengaluru Lease Deal: అద్దె రూ.2,130 కోట్లు.. టీఎసీఎస్ నయా రికార్డ్..

Tcs Office

Tcs Office

TCS Bengaluru Lease Deal: ఈ కంపెనీ చెల్లించే అద్దెతో కొన్ని వందల కుటుంబాలు నెలల పాటు సంతోషంగా జీవించే అవకాశం ఉంది. ఇంతకీ ఏంటా కంపెనీ, ఎంత మొత్తం అద్దె చెల్లిస్తుందని అనుకుంటున్నారా? కంపెనీ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అయితే ఈ కంపెనీ బెంగళూరులో కూడా ఓ ఆఫీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. సరే ఆలోచన అయితే చేసింది.. దానిని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తే అక్షరాలా ఆ కొత్త కంపెనీ అద్దె వచ్చి రూ.2,130 కోట్లు అని తేలింది. సరే ఈ రెంజ్ అద్దెను ఎవరూ ఊహించి ఉండరూ. కానీ అక్కడ ఉన్నది దేశంలో పేరు మోసిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్… కంపెనీ అద్దె చెల్లించడానికి డీల్ చేసుకుంది. ఇంత అద్దె చెల్లించాల్సిన కంపెనీ ప్రత్యేకతలు ఏంటి, ఎన్నేళ్లకు కంపెనీ అగ్రిమెంట్ చేసుకుంది అనేవి ఈ స్టోరీలో చూద్దాం..

READ ALSO: 7,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాలతో రాబోతున్న Oppo Find X9 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్!

1.4 మిలియన్ చదరపు అడుగులు..
బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని 360 బిజినెస్ పార్క్‌లో 1.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లీజు ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఇటీవల సంవత్సరాలలో నగరంలో జరిగిన అతిపెద్ద కార్యాలయ లావాదేవీలలో ఒకటిగా నిలిచినట్లు సమాచారం. ల్యాబ్‌జోన్ ఎలక్ట్రానిక్స్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం పరిధిలోని ప్రాజెక్ట్ టవర్స్ 5A, 5Bలను ఈ ఒప్పందం కవర్ చేస్తుంది. టవర్ 5Aలో 6.8 లక్షల చదరపు అడుగులు, టవర్ 5Bలో 7.2 లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. టీసీఎస్ లీజు రెండు దశల్లో అమలు కానుంది. మొదటి దశ గ్రౌండ్ ప్లస్ ఏడు అంతస్తులను కవర్ చేస్తుంది. ఇది ఏప్రిల్ 1, 2026న ప్రారంభమవుతుంది. రెండవ దశ ఎనిమిది నుంచి పదమూడు అంతస్తులను కవర్ చేస్తుంది. ఇది ఆగస్టు 1, 2026న ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందం 15 ఏళ్ల కాలపరిమితితో ఉంది. TCS నెలవారీ అద్దెను చదరపు అడుగుకు రూ. 66.5 చొప్పున రూ.9.31 కోట్లు చెల్లిస్తుంది. ఈ ఒప్పందానికి రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది. అలాగే ప్రతి మూడు ఏళ్లకు అద్దెలో 12% పెరుగుదల ఉంటుంది. లీజు వ్యవధిలో మొత్తం వ్యయం రూ.2,130 కోట్లుగా అంచనా.

బెంగళూరు ఐటీ కారిడార్‌లో విస్తరణ
ఈ ప్రాజెక్టులో మూడు బేస్మెంట్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 13 పై అంతస్తులు ఉన్నాయి. ఈ లీజుతో TCS బెంగళూరులోని దక్షిణ ఐటీ కారిడార్‌లో తన ఉనికిని విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరణ వ్యూహంలో భాగంగా కొత్త క్యాంపస్‌లను ఏర్పాటు చేయడం, కార్యాలయ స్థలాలను లీజుకు ఇవ్వడం, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం TCS జూన్‌లో రూ.4,500 కోట్లకు పైగా కేటాయించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. బెంగళూరులో కంపెనీ ఇప్పటికే సత్వ–దర్శిత సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్ నుంచి 1.4 – 1.6 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని రూ.2,250 కోట్లకు, TRIL నుంచి మరో 3.2 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని రూ.1,625 కోట్లకు కొనుగోలు చేసింది.

టైర్-II నగరాల్లో కూడా..
TCS టైర్-II నగరాల్లో కూడా తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. విశాఖపట్నంలో 2024లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 99 ఏళ్లకు 21.6 ఎకరాలను లీజుకు తీసుకుంది. కొచ్చిలో కిన్‌ఫ్రా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో 37 ఎకరాలను రూ.690 కోట్లకు కొనుగోలు చేసింది. కోయంబత్తూర్, హైదరాబాద్‌లలో అదనపు కార్యాలయ స్థలాలను కూడా కంపెనీ లీజుకు తీసుకుంది. కోల్‌కతాలో TCS తన సంచిత పార్క్, బెంగాల్ సిలికాన్ వ్యాలీ హబ్ క్యాంపస్‌లలో 30 ఎకరాలను అభివృద్ధి చేస్తోంది.

READ ALSO: Mission Sudarshan Chakra: భారత్‌కు రక్షణ కవచం.. శత్రువులకు చుక్కలే..

Exit mobile version