Housing sales Dropped: భారతదేశం ఎగుమతి చేసే వస్తువులపై అమెరికా విధించిన టారీఫ్స్ కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు, వాటి ఉద్యోగుల ఆదాయంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.45 లక్షల ధర పలికేగృహాల విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉందని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ వెల్లడించింది. ప్రధానంగా ఈ సంస్థల్లో పని చేసే ఎంప్లాయిస్ ఈ ఇళ్లను కొనుగోలు చేస్తారని తెలిపింది. యూఎస్ ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈల వాటా భారీగా ఉంటుంది. అధిక సుంకాలతో వాటి ఉత్పత్తులు, ఇతర దేశాలతో పోటీపడే ఛాన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో చిన్న, మధ్య తరగతి కంపెనీల ఆర్డర్లు తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది ప్రధానంగా ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అనరాక్ సంస్థ చెప్పుకొచ్చింది.
Read Also: Coolie Bookings : తెలుగు స్టేట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్
అయతే, కరోనా మహమ్మారి తర్వాత గృహాల విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గిందని అనరాక్ సంస్థ తెలిపింది. ఇక, ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 1.9 లక్షల ఇళ్లు అమ్ముడైనట్లు.. వీటిలో కేవలం 34,565 యూనిట్లు మాత్రమే అందుబాటు ధరల్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కాగా, ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఈ విభాగానికి టారీఫ్స్ భారీ షాక్ అని చెప్పాలి.. మిగిలిన కొద్దిపాటి ఆశలనూ నాశనం చేసే ఛాన్స్ ఉందని అనరాక్ రీసెర్చ్, అడ్వైజరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ వెల్లడించారు. డెవలపర్లు ఇక నుంచి అందుబాటు ధరలకే ఇళ్ల ప్రాజెక్టులను స్టార్ట్ చేసేందుకు ఆలోచిస్తారని పేర్కొన్నారు.
