Post Office Scheme: ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం కన్నా.. వాటిని దాచుకోవడం చాలా కష్టం అవుతుంది. కొంత మంది ముందు వచ్చి వారి సేవింగ్స్‌ను పెట్టుబడి పెడదామని అనుకున్నా ఎక్కడ పెట్టాలో అనే గందళగోలం ఉంటుంది. నిజానికి చాలా మంది ఆర్థిక నిపుణుల అభిప్రాయంలో పోస్ట్ ఆఫీస్ పథకాలు అన్ని పెట్టుబడి విధానాల్లో ముందు ఉంటాయి. ఎందుకంటే సురక్షితమైన పెట్టుబడితో పాటు భారీ లాభాలను ఆశించే వారికి ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు అనేవి బెస్ట్ ఛాయిస్ అని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ రోజుల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ ఒక వరంలా మారింది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేవలం వడ్డీ రూపంలోనే రూ.18 లక్షలకు పైగా సంపాదించవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం PPFపై 7.1% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకం యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ EEE (Exempt-Exempt-Exempt) హోదా. అంటే మీరు పెట్టే పెట్టుబడిపై పన్ను ఉండదు (సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు). అలాగే ఈ పెట్టుబడిపై వచ్చే వడ్డీకి కూడా పన్ను కట్టక్కర్లేదు. దీనితో పాటు మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నగదుపై కూడా ఎలాంటి పన్ను ఉండదు. నిజానికి ఈ పథకంలో చేరడం చాలా సులభం. ఏడాదికి కనీసం రూ.500 పెట్టుబడితో ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు జమ చేసే అవకాశం ఉంది. మైనర్ల పేరు మీద కూడా తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవవచ్చు. అయితే ఇందులో జాయింట్ అకౌంట్‌కు ఛాన్స్ లేదు.
రూ.18 లక్షల వడ్డీ ఎలా వస్తుందంటే..
PPF మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. మీరు ప్రతి సంవత్సరం గరిష్ట పరిమితి అయిన రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అలా మీరు 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.22,50,000 అవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 7.1% వడ్డీ రేటు ప్రకారం.. 15 ఏళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం వడ్డీ రూ.18,18,209 గా ఉంటుంది. అంటే మీ పెట్టుబడి మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి అందే మొత్తం డబ్బులు రూ.40,68,209. ఈ డబ్బులతో సింపుల్‌గా మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే ఇలా చేయండి.. ఈ 15 ఏళ్ల కాలపరిమితిని మరో 5 ఏళ్ల చొప్పున రెండుసార్లు (మొత్తం 10 ఏళ్లు) పొడిగించుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి మీరు జమ చేసేది రూ.30 లక్షలు అయితే, వడ్డీతో కలిపి అది రూ.66.58 లక్షలు అవుతుంది. అదే 25 ఏళ్ల కాలానికి అయితే మీరు జమ చేసే మొత్తం రూ.₹37.50 లక్షలు అవుతుంది. చక్రవడ్డీ పుణ్యమా అని మీ మొత్తం ఫండ్ రూ.1.03 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో వడ్డీ వాటాయే సుమారు రూ. 65.58 లక్షలు ఉంటుంది తెలుసా. నిజానికి లాంగ్ టర్మ్ ఫైనాల్షియల్ హెల్త్ కోసం చూసే వారికి, ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునే వారికి ఈ పోస్ట్ ఆఫీస్ PPF ఒక అద్భుతమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు.
