Site icon NTV Telugu

New Pension Scheme : రూ. 5వేల పెట్టుబడితో.. రూ. 45,000 వరకూ పెన్షన్.. ఎలాగంటే?

Pension Plan

Pension Plan

వృద్దాప్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చాలా మంది అనేక రకాల స్కీమ్ లలో పెట్టుబడులు పెడతారు.. కరోనా తర్వాత ప్రతి ఒక్కరు అనేక పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందులో కొన్ని స్కీమ్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలను పొందవచ్చు.. రిస్క్ లేకుండా మంచి లాభాలను అందించే స్కీమ్ లలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి..పెట్టుబడి చాలా సురక్షితమైంది. మైగా అధిక వడ్డీ వస్తుంది. ఇది పదవీవిరమణ తర్వాత మీకు, మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.. ఈ సిస్టమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

మీరు మీ భార్యల పేరు మీద న్యూ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఖాతా ప్రారంభించవచ్చు. ఈ ఖాతా ద్వారా మీ భార్యకు 60ఏళ్లు వచ్చే సరికి పెద్ద మొత్తంలో నగదు సమకూరుతుంది. దీంతో పాటు నెలవారీ పెన్షన్ రూపేణా కొంత మొత్తం జమవుతుంది. ఇది మాత్రమేకాదు ఈ ఎన్సీఎస్ ఖాతా ద్వారా మీ భార్య నెలవారీ ఎంత మొత్తం పెన్షన్ గా పొందాలో మీరే డిసైడ్ చేయొచ్చు. దీంతో మీ భార్య వృద్ధాప్యంలో మీరున్నా లేకున్నా ఎవరిపైనా ఆధారపడకుండా బతకగలుతుంది.. మీ సౌకర్యాన్ని బట్టి మీరు డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యొచ్చు..

ఉదాహరణకు మీరు నెలకు రూ. 5,000 చొప్పున జమచేస్తున్నారనుకొండి. ప్రతి ఏటా ఆమె పెట్టిన పెట్టుబడిపై 10శాతం ఆదాయాన్ని పొందుతుంది. అలా ఆమె 60ఏళ్లకు చేరుకొనే సమయానికి రూ. 1.12కోట్లు ఆమె ఖాతాలో ఉంటాయి. దీనిలో రూ. 45లక్షలు ఆమె తీసుకునే వీలుంటుంది. దీంతో పాటు ప్రతి నెల రూ. 45,000 పెన్షన్ కూడా తీసుకునే వీలుంటుంది.. ఎన్పీఎస్ కు కేంద్ర ప్రభుత్వ మద్ధతు ఉంది. అందుకని మీ నగదుకు పూర్తి భద్రత ఉంటుంది. మీరు చెల్లించే ఈ మొత్తాన్ని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫండ్ మేనేజర్ల బాధ్యత తీసుకుంటుంది. అందువల్ల ఎన్పీఎస్ లో మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది… మీకు నచ్చితే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది..

Exit mobile version