NTV Telugu Site icon

SEBI chief: సెబీ చీఫ్‌కు షాక్.. పార్లమెంట్ కమిటీ సమన్లు

Sebimadhabi

Sebimadhabi

సెబీ చీఫ్‌ మాధబి బుచ్‌కి పార్లమెంటరీ ప్యానెల్ షాకిచ్చింది. పార్లమెంటరీ కమిటీ శనివారం ఆమెకు సమన్లు జారీ చేసింది. సెబీ చీఫ్‌తో పాటు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ అనిల్‌కుమార్‌ లాహోటీలను ఈ నెల 24 విచారణకు హాజరు కావాల్సిందిగా పార్లమెంట్‌లోని పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ (పీఎసీ) నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఆర్థిక వ్యవహారాల విభాగం), రెవెన్యూశాఖలోని ఉన్నతాధికారులను కూడా కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Game Changer : పైసలిచ్చి ట్రెండ్‌ చేస్తున్నారా.. టాలెంట్‌ బాగుంది..!

అదానీ విదేశీ సంస్థలతో మాధబికి మంచి సంబంధాలు ఉన్నాయని.. అక్కడ నుంచి ఆమె ఆదాయాలు కూడా పొందుతున్నట్లు అమెరికన్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసింది. ఈ నివేదికపై ప్రతిపక్షాలు ఆగస్టు నుంచి నిరసనలు చేపట్టాయి. మాధబి బుచ్‌ రాజీనామా చేయాలని, నివేదికపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఆమెకు పార్లమెంట్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈనెల 24న కాంగ్రెస్, హిండెన్‌బర్గ్‌పై చేసిన ఆరోపణలపై ప్రశ్నించనున్నారు. అలాగే అదానీ సంస్థతో ఉన్న సంబంధాలపై కూడా విచారించనున్నారు.

ఇది కూడా చదవండి: Shivraj Singh Chouhan: రైతులకు గుడ్‌న్యూస్.. పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి

ఇదిలా ఉంటే పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌, ట్రాయ్‌ ఛైర్‌పర్సన్‌ అనిల్ కుమార్‌ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి. వారి తరపున సీనియర్‌ అధికారులు సమావేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..

Show comments