Site icon NTV Telugu

Mukesh Ambani’s Salary: అపర కుబేరుడి సాలరీ సున్నా.. ఐదేళ్లుగా రూపాయి తీసుకొని ముఖేష్.. కానీ!

Mukesh Ambani

Mukesh Ambani

Mukesh Ambani’s Salary: భారతీయ వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ సాలరీ ఎంతో తెలుసా.. సున్నా. నిజమే ఆయన జీతం అక్షరాల సున్నా. వరుసగా ఐదేళ్ల నుంచి ఆయన కంపెనీ నుంచి వేతనం తీసుకోలేదు. ఆయన మాత్రమే కాదు.. ఆయన వారసులు కూడా సేమ్. వాళ్లు కూడా రూపాయి జీతం తీసుకోలేదు. కానీ వాళ్లకు కంపెనీ కొంత మొత్తం అందజేసింది. అది ఎలా అంటే.. వాళ్లు బోర్డు సభ్యులుగా సిట్టింగ్‌ ఫీజు, కమీషన్‌ రూపంలో డబ్బులను కంపెనీ నుంచి అందుకున్నారు. దేశాన్ని కరోనా కుదిపేసిన నాటి నుంచి వాళ్లు జీతం తీసుకోవడం ఆపేశారు. ఈ వివరాలన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక నివేదికలో పేర్కొంది.

READ MORE: TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు

ఆ ఖర్చంతా కంపెనీదే..
2021-22లో కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలయిన నేపథ్యంలో వార్షిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ప్రకటించారు. 2008-09 నుంచి కరోనా ముందు వరకు వార్షిక రెమ్యూనరేషన్‌ తీసుకున్నా, గరిష్ఠంగా రూ.15 కోట్లే తీసుకోవాలని పరిమితి విధించుకున్నారు. 2029 ఏప్రిల్‌ వరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌గా ఆయన పదవిలో కొనసాగుతారు. కానీ ఆయనకు జీతం, ఇతర అలవెన్సులు, ముందస్తు ఖర్చులు, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు, కమీషన్లు, స్టాక్ ఆప్షన్లను ఏం లేవు. కానీ అంబానీ ప్రయాణం, లాడ్జింగ్‌, బోర్డింగ్‌, వ్యాపార పర్యటనలకయ్యే ఖర్చులను మాత్రం కంపెనీనే భరిస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ముకేశ్‌తో పాటు ఆయన కుటుంబానికి భద్రతకయ్యే ఖర్చూ అంతా కంపెనీదే. 2023లో ముకేశ్ సతీమణి నీతా అంబానీ బోర్డు నుంచి వైదొలిగారు. ఆమెకు ఆ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.0.02 కోట్లు సిట్టింగ్ ఫీజు, రూ.0.97 కోట్లు కమీషన్ కింద ఇచ్చింది. అంబానీ వారసులు ఈశా, ఆకాశ్‌, అనంత్‌ 2023 అక్టోబర్‌లో రిలయన్స్‌ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారికి ఆ ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్కరు సిట్టింగ్‌ ఫీజు కింద రూ.0.06 కోట్లు, కమీషన్ కింద రూ.2.25 కోట్లు అందుకున్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు నిఖిల్ ఆర్‌.మెస్వానీ, హితల్ ఆర్‌. మెస్వానీ రూ.25 కోట్లు పొందారు.

కంపెనీలో ముకేశ్‌ కుటుంబానికి 50.33 శాతం వాటా..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలోనే అతిపెద్ద విలువైన కంపెనీ. ఈ కంపెనీలో ముకేశ్‌, ఆయన కుటుంబానికి 50.33 శాతం వాటా ఉంది. ఈ వాటాతో వారికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ రూపంలో రూ.3,322.7 కోట్లు రావడం గమనార్హం. ఇటీవల ఫోర్బ్స్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ముకేశ్ నికర సంపద 103.3 బిలియన్ డాలర్లు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 18వ స్థానంలో నిలిచారు. మీకు తెలుసా కంపెనీలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ముకేశ్‌, ఆయన వారసులు 6.44 లక్షల కోట్ల షేర్లు కలిగి ఉన్నారు.

READ MORE: Ghati-Mirai-The Girlfriend : అనుష్క, తేజసజ్జ మధ్య భీకర పోటీ.. రష్మిక నిలబడుతుందా..?

Exit mobile version