Mukesh Ambani: భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచ కుబేరుల్లో ఒకడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ. నిజానికి ఆయనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. భారత దేశ నంబర్ వన్ ధనవంతుడిగా ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తి ముఖేష్ అంబానీ. చమురు, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ మొదలైన వ్యాపారాలను సక్సెస్‌పుల్‌గా రన్ చేస్తున్న ఈ పారిశ్రామిక దిగ్గజం ఒక రోజుకు ఎంత సంపాదిస్తారు, ఒక నిమిషానికి ఎంత వెనకేస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Renu Desai : కాలభైరవుడిని చంపేస్తారా? శునకాల సంహారంపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు ముఖేష్ అంబానీ. ఈయన సుమారు 113 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 16వ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 1957 ఏప్రిల్ 19న ధీరూభాయ్ – కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించిన ముఖేష్ అంబానీ.. అనతి కాలంలోనే తండ్రీ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారంలో ఓనమాలు నేర్చుకున్నాడు. పలు నివేదికలు ప్రకారం.. ప్రతిరోజూ ముఖేష్ అంబానీ సుమారు రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు. నిమిషానికి సుమారు రూ.2.35 లక్షలు నుంచి రూ.3.09 లక్షల వరకు ఆయన సంపద ఉంటుందని అంచనా. నిజానికి ఆయనకు ఈ ఆదాయం తన జీతం నుంచి రాదు. కంపెనీ లాభాలు, వాటా, పెట్టుబడి మొదలైన వాటి నుంచి వస్తుంది. ప్రతీ రోజు ఉండే స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి ఆయన సంపదలో చిన్న మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి. నిజానికి ఈ ప్రపంచ కుబేరుడు గత ఐదేళ్ల నుంచి తన కంపెనీలో జీతం తీసుకోలేదు. కానీ ఆయనకు తన కంపెనీ షేర్ నుంచి, వాటాల నుంచి మాత్రం ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయి.
READ ALSO: Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీవీలో వచ్చేది ఆ రోజే!
