Site icon NTV Telugu

LIC: ఎల్ఐసీ వ‌ద్ద భారీగా నిధులు…

భార‌త ప్ర‌భుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ వ‌ద్ద రూ. 21,539 కోట్ల నిధులు ఉన్న‌ట్టు ఆ సంస్థ తెలియ‌జేసింది. ఇవి ఎవ‌రూ క్లెయిం చేయ‌ని నిధుల‌ని పేర్కొన్న‌ది. ఎల్ఐసీ సంస్థ ప‌బ్లిక్ ఇష్యూకి వెళ్ల‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికోసం సెబీకి ధ‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. ఈ ధ‌ర‌ఖాస్తులో ప‌త్రాల్లో నిధుల కు సంబంధించిన వివ‌రాల‌ను పేర్కొన్నది. మార్చి 2020 నాటికి రూ. 16,052.65 కోట్ల అన్‌క్లెయిమ్ నిధులు ఉండ‌గా, అవి 2021 మార్చినాటికి రూ. 18,495 కోట్ల‌కు చేరిన‌ట్లు ప్రాథ‌మిక ప‌త్రాల్లో పేర్కొన్న‌ది. ఇక వ‌డ్డీతో క‌లిపి మొత్తం రూ. 21,539 కోట్ల‌కు చేరిన‌ట్టు ఎల్ఐసీ సంస్థ తెలియ‌జేసింది.

Read: Rare Ghost: శాస్త్ర‌వేత్త‌ల‌ను భ‌య‌పెట్టిన వింత జంతువు…

వెయ్యి కోట్లు లేదా అంత‌కంటే ఎక్కువ మొత్తంలో అన్ క్లెయిమ్ నిధులు పోగైతే వాటి వివ‌రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు, వీటికి సంబంధించిన స‌మాచారాన్ని ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో ఉంచాలి. ప‌దేళ్ల‌పాటు దీనికి సంబంధించిన స‌మాచారాన్ని భ‌ద్ర‌ప‌ర‌చాల్సి ఉంటుంది. పాల‌సీదారులు లేదా ల‌బ్దిదారులు చూసుకునేలా స‌మాచారం ఉండాలి. అంతేకాదు, ప‌దేళ్ల త‌రువాత అన్‌క్లెయిమ్ నిధుల‌ను కేంద్ర బ‌డ్జెట్ డివిజ‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం సీనియ‌ర్ సిటిజ‌న్స్ వెల్ఫేర్ ఫండ్‌కు కు బ‌దిలీ చేయాల్సి ఉంటుంది.

Exit mobile version