Site icon NTV Telugu

Jubilant Food Works: బ్రెడ్ ముక్కతో వేల కోట్ల సామ్రాజ్యం.. ఏడాదికి రూ. 6900 కోట్ల లాభం! సక్సెస్ సీక్రెట్ ఇదే!

Jubilant Foodworks

Jubilant Foodworks

Jubilant Food Works: భారతదేశపు అతిపెద్ద క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) చైన్ ఆపరేటర్ ‘జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్’ (JFL) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. డొమినోస్, పోపాయెస్ వంటి గ్లోబల్ బ్రాండ్‌లను నిర్వహిస్తున్న ఈ సంస్థ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయంలో భారీ లాభాలను సాధించినట్లు తాజాగా వెల్లడించింది.

READ ALSO: 3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

కళ్లు చెదిరే ఆదాయం.. రికార్డు స్థాయిలో వృద్ధి
కంపెనీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.9,544.1 కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 17.2 శాతం పెరుగుదల కావడం గమనార్హం. కేవలం మార్చి త్రైమాసికంలోనే దేశీయ ఆదాయం 6.2 శాతం పెరిగి రూ.1,686 కోట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. ఈ కంపెనీ మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.6,887.8 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. అంతర్జాతీయ కార్యకలాపాలను కూడా కలుపుకుంటే, ఈ త్రైమాసికంలో మొత్తం కంపెనీ ఆదాయం రూ.2,505.8 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 19.1 శాతం ఎక్కువ.

ఇదే సమయంలో JFL తన నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరిస్తోంది. తాజా త్రైమాసికంలో గ్రూప్ మొత్తం 69 కొత్త స్టోర్‌లను ఏర్పాటు చేసింది. భారత్‌లో కొత్తగా 59 స్టోర్‌లను ప్రారంభించడంతో, దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 2,455కి చేరింది. టర్కీలో ఈ కంపెనీకి చెందిన మరో 4 స్టోర్లు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం భారత్, టర్కీ, బంగ్లాదేశ్, శ్రీలంక సహా 6 దేశాల్లో JFL తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 3,663కి చేరుకుంది. వ్యాపార వ్యూహాల్లో భాగంగా JFL కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికన్ కాఫీ, డోనట్ బ్రాండ్ ‘డంకిన్’ (Dunkin’) తో ఉన్న ఫ్రాంచైజీ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోకూడదని తాజాగా ఈ కంపెనీ నిర్ణయం తీసుకుంది. 2026 డిసెంబర్ 31తో ఈ ఒప్పందం ముగియనుండగా, ఆ లోపు స్టోర్లను క్రమంగా మూసివేయనున్నారు. మరోవైపు డొమినోస్ పిజ్జా ఇంటర్నేషనల్‌తో తన ప్రత్యేక ఫ్రాంచైజీ హక్కులను మరో 15 ఏళ్ల పాటు పునరుద్ధరించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. అదనంగా మరో 10 ఏళ్లు పొడిగించుకునే అవకాశం కూడా ఉందని సమాచారం.

గ్లోబల్ బ్రాండ్‌లతో పాటు, JFL తన సొంత బ్రాండ్‌లైన ‘హాంగ్స్ కిచెన్’, టర్కీలోని కాఫీ బ్రాండ్ ‘కాఫీ’ లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 1995లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సంస్థ, నేడు ఆరు అంతర్జాతీయ మార్కెట్లలో తిరుగులేని శక్తిగా ఎదిగింది.

READ ALSO: Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

Exit mobile version