పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. తాజాగా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువును మార్చి 15 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. కాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది.
Read Also: ఐపీఎల్ స్పాన్సర్‌గా చైనా కంపెనీ అవుట్… ఇకపై ‘టాటా’ ఐపీఎల్
కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు 2022 మార్చి 15 వరకు 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు నిజానికి 2021 డిసెంబర్ 31నే ముగిసింది. అయితే ఈసారి గడువు పెంచేది లేదని చివరిరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా. కానీ అనూహ్యంగా గడువు ముగిసిన 10 రోజుల తర్వాత ఐటీ రిటర్న్స్ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
