Site icon NTV Telugu

Air Cooler: బ్రాండెడ్ ఎయిర్ కూలర్స్ పై క్రేజీ డీల్స్.. చౌక ధరలో లభిస్తున్నవి ఇవే!

Coolers

Coolers

ఇప్పటి వరకు చలి వణికించింది. మరికొన్ని రోజుల్లో సమ్మర్ సీజన్ ప్రారంభం కాబోతోంది. కానీ, ఈ సారి ముందుగానే ఎండలు దంచి కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం వేళ ఎండ గట్టిగానే దంచికొడుతోంది. ఎండ, ఉక్కపోతల నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్స్, ఫ్యాన్లకు పనిచెప్పాల్సి వస్తోంది. ఎండవేడిమిని తట్టుకోవాలంటే ఇంట్లో కూలర్ ను ప్లాన్ చేసుకోవాల్సిందే. సమ్మర్ రాకముందే క్వాలిటీ కూలర్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తే ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ కూలర్స్ లభిస్తున్నాయి.

Hindware Smart Appliances 45 L Room/Personal Air Cooler:

హింద్వేర్ స్మార్ట్ అప్లియెన్సెస్ బ్రాండ్ కు చెందిన ఎయిర్ కూలర్ పై ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 57 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 13,990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 5,999కే సొంతం చేసుకోవచ్చు. 45లీటర్ల సామార్థ్యంతో వస్తుంది. కూల్ అండ్ క్లీన్ ఎయిర్ అందిస్తుంది. అన్ని దిశల్లో ఎయిర్ ను వెదజల్లుతుంది. వాటర్ లెవల్ ఇండికేటర్, స్పీడ్ రెగ్యూలేటర్, ఇన్వెర్టర్ కాంపాటిబిలిటీ, క్యాస్ట్రో వీల్స్ తో వస్తుంది.

Orient Electric 90 L Desert Air Cooler:

బ్రాండెడ్ ఎయిర్ కూలర్ కావాలనుకునే వారికి ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి సూపర్ ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది. ఇది 90లీటర్ల సామార్థ్యంతో వస్తుంది. ఈ ఎయిర్ కూలర్ పై 45 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ. 18,490గా ఉంది. ఆఫర్లో మీరు రూ. 9999కే సొంతం చేసుకోవచ్చు. 400 స్క్వేర్ ఫీట్ రూమ్స్ కు ఇది అనుకూలంగా ఉంటుంది.

BAJAJ 24 L Room/Personal Air Cooler:

బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఎయిర్ కూలర్ కావాలనుకుంటే బజాజ్ కు చెందిన 24లీటర్ల కెపాసిటితో వస్తున్న ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో దీనిపై 28 శాతం తగ్గింపు లభిస్తోంది.దీని అసలు ధర రూ. 7360గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 5299కే సొంతం చేసుకోవచ్చు. 3స్పీడ్ కంట్రోల్ తో వస్తుంది. ఎక్కడికంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు.

Exit mobile version