మార్చి నెల ముగిసిపోయింది.. మరో మూడు రోజుల్లో ఏప్రిల్ నెల రాబోతుంది.. అలాగే మార్చి 31 కి గత ఏడాది ఆర్థిక సంవత్సరం కూడా ముగిసిపోతుంది.. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది.. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అదేవిధంగా ఏప్రిల్ లో కూడా సెలవులు ఉన్నాయి.. తాజాగా ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.. ఆ నెలలో ఏకంగా 14 రోజులు సెలవులు ఉన్నాయని తెలుస్తుంది.. ఆ లిస్ట్ ను ఒకసారి చూసేద్దాం..
ఏప్రిల్ లో బ్యాంక్ సెలవుల లిస్ట్..
ఏప్రిల్ 1- సోమవారం- ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్
ఏప్రిల్ 5- శుక్రవారం- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమత్- ఉల్- విదా
ఏప్రిల్ 7- ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 9 – మంగళవారం- ఉగాది, గుడి పడ్వా, తెలుగు నూతన సంవత్సరం తెలుగు రాష్ట్రాల బ్యాంకులకు సెలవులు..
ఏప్రిల్ 10 – బుధవారం- రంజాన్ (ఈద్- ఉల్- ఫితుర్)- కేరళలోని బ్యాంకులకు హాలిడే.
ఏప్రిల్ 11- గురువారం- రంజాన్
ఏప్రిల్ 13- రెండో శనివారం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే బిజు పండగ, బైశాఖి పండగ
ఏప్రిల్ 14- ఆదివారం
ఏప్రిల్ 15- సోమవారం కొన్ని రాష్ట్రాలకు హాలీడే
ఏప్రిల్ 17- బుధవారం- శ్రీరామనవమి..
ఏప్రిల్ 20- శనివారం- గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు..
ఏప్రిల్ 21- ఆదివారం
ఏప్రిల్ 27- నాలుగో శనివారం
ఏప్రిల్ 28- ఆదివారం
ఈరోజుల్లో బ్యాంకులు పనిచెయ్యవు ఏదైన పని ఉంటే ముందు రోజుల్లో చూసుకోవడం మంచిది..