Site icon NTV Telugu

పండుగపూట గ్యాస్‌పై బంపరాఫర్‌.. వారికి మాత్రమే

ప్రతీనెల గ్యాస్‌ ధర పైపైకి ఎగబాకుతూనే ఉంది.. సబ్సిడీ వంట గ్యాస్‌ ధర ఏకంగా వెయ్యి రూపాయలకు చేరువైంది.. అయితే.. తన గ్యాస్‌ వినియోగదారులకు నవరాత్రి సందర్భంగా హిందూస్థాన్ పెట్రోలియం బంపరాఫర్‌ తెచ్చింది.. నవరాత్రి సమయంలో గ్యాస్‌ సిలిండర్ల కొనుగోలుపై రూ.10,000 వరకు బంగారం గెలుచుకునే అవకాశాన్ని కలిపించింది.. హిందూస్థాన్ పెట్రోలియం ప్రకటించిన ఈ బంపరాఫర్ ఈ నెల 7వ తేదీ నుంచి 16 తేదీల మధ్య అందుబాటులో ఉండనుండగా.. ఈ ఆఫర్ కింద ప్రతీరోజూ ఐదుగురు విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది హిందూస్థాన్ పెట్రోలియం.. ఇక, పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్‌ కోసం డబ్బు చెల్లిస్తే మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉందని వెల్లడించింది.

Exit mobile version