NTV Telugu Site icon

Google: 18 ఏళ్లు పనిచేసినా వదల్లేదు.. కొత్త ఉద్యోగం కోసం వెతుకులాట..

Google

Google

Google: ఆర్థిక మందగమనం, ఆర్థికమాంద్యం భయాలు టెక్ ఉద్యోగుల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసిపారేశారు. గతేడాది నవంబర్ లో ప్రారంభమైన లేఆఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఐటీ సంస్థల్లో కొన్ని ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఉద్యోగులను కూడా ఉపేక్షించడం లేదు. తాజాగా గూగుల్ కంపెనీలో 18 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించారు. సెప్టెంబర్ నెలలో తన గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి వందలాది మంది ఉద్యోగుల్ని గూగుల్ తొలగించింది.

Read Also: Vivek Venkataswamy : ఎన్నికల్లో పోటీ అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది

తాజాగా ఉద్యోగం నుంచి తొలగించబడిన మహిళ కొత్త ఉద్యోగాల కోసం లింక్డ్‌ఇన్‌లో తన వివరాలను పోస్ట్ చేసింది. దాదాపుగా 18 ఏళ్లు గూగుల్‌లో పనిచేశామని తెలిపింది. తాను హెచ్ఆర్, టాలెంట్ అక్విజిషన్, కెరీర్ డెవలప్మెంట్ ఇంటస్ట్రీల్లో కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నట్లు పేర్కొంది. ఇటీవల తొలగింపుల్లో ఉద్యోగం కోల్పోయానని పోస్టులో వెల్లడించింది. గతంలో ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది లింక్డ్ఇన్ లో భావోద్వేగ పోస్టులు పెట్టారు.

ప్రస్తుతం గూగుల్ హెచ్ఆర్ విభాగంలో లేఆఫ్స్ జరిగాయి. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో ఒకేసారి 12000 మందిని తొలగించింది. ఒక్క గూగుల్ మాత్రమే కాదు.. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.