మహిళలకు భారీ షాక్.. ఈరోజు బంగారం ధర మళ్లీ పెరిగింది.. నిన్నటీ ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..పండుగల సీజన్ నేపథ్యంలో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. రానున్న రోజుల్లో దీపావళి ఉండడం, పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. ఈరోజు మార్కెట్ లో ధర ఎలా ఉందంటే.. 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 56550 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిలు పెరిగి 61690 గా ఉంది. అలాగే వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 78000 గా ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..
*. ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,840గా ఉంది.
*, ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.
*. ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,750కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,910గా ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 61,690గా ఉంది.
*. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,690గా ఉంది..
ఇక వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా బుధవారం అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 500 తగ్గి రూ. 74,600వద్ద కొనసాగుతోంది..ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. చెన్నైలో మాత్రం కిలో వెండి ధర అత్యధికంగా రూ. 78,000వద్ద కొనసాగుతోంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ధర కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..