NTV Telugu Site icon

Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. ఎంతంటే?

Gold

Gold

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ ధర ఈరోజు రూ. 220 తగ్గి రూ. 63,050గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర రూ.రూ.57,800 వద్ద కొనసాగుతోంది. ఈరోజు రూ. 200 తగ్గింది.. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.200 తగ్గింది. నిన్న కిలో వెండి ధర రూ. 78,000 కాగా ఈరోజు రూ. 77,800 కు చేరింది. ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ. 58,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,710 కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. డిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ 57,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,180 గా నమోదైంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 57,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050 గా ఉంది.

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.. హైదరాబాద్..రూ. 77,800, విజయవాడ..రూ. 77,800,చెన్నై..రూ. 77,800, ముంబాయి..రూ. 76,400, బెంగళూరు..రూ. 73,800గా నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Show comments