బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి.. 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,000 ఉండగా ఈరోజు రూ.58,000 గా కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటికి ఈరోజుటికి పెద్ద మార్పు కనిపించడం లేదు. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది.. ఈరోజు వెండి స్థిరంగా కొనసాగుతుంది.. రూ. 78,000 వద్ద కొనసాగుతుంది.. ఈరోజు ప్రధాన నగరాల వద్ద ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ. 58,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,930 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ 58,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,400 గా నమోదైంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 58,000 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270 గా ఉంది.
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.. హైదరాబాద్..రూ. 78,000, విజయవాడ..రూ. 78,000,చెన్నై..రూ. 78,000, ముంబాయి..రూ. 76,600, బెంగళూరు..రూ. 74,000గా నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..