బంగారం కొనాలని అనుకొనే వారికి గుడ్ న్యూస్ పసిడి ధరలు ఇవాళ కూడా స్థిరంగా ఉన్నాయి.. ఫిబ్రవరి 1న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,270 గా ఉంది.. మార్కెట్ లో నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. అలాగే వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పులు లేవని తెలుస్తుంది.. దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,420గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,270 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,500 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,820తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,270తో విక్రయిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,270 వద్ద నమోదు అయ్యింది..
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తుంది.. వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,500గా నమోదైంది.. ఢిల్లీలో కిలో వెండి రూ.76,500గా ఉంది. ముంబైలో రూ.76,500, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.78,000 వద్ద కొనసాగుతుంది.. ఇక రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..