మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో పాటు, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 10 చొప్పున పెరుగుదల కనిపించింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 54,910కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900కి చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ప్రధాన మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
*.ఢిల్లీలో సోమవారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,060 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330 గా ఉంది.
*. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,910 వద్ద కొనసాగుతండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,900 గా ఉంది.
*. కోల్‌కతాలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,900 వద్ద కొనసాగుతోంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910 , 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,900 వద్ద కొనసాగుతోంది..
*. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 54,910 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900 గా ఉంది.
ఇక బంగారం ధరలు, పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది..ప్రధాన నగరాల్లో వెండి ధరలను చూస్తే..ఢిల్లీలో కిలో వెండి ధర రూ 74,700, ముంబయిలో కిలో వెండి ధర రూ. 74,700, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,700గా ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,250 గా ఉండగా, చెన్నైలో సోమవారం కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,200 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..