Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..

  • తగ్గిన బంగారం, వెండి ధరలు
  • రూ.980 తగ్గి రూ.1,56,930కు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
  • రూ.900 తగ్గి రూ.1,43,850కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేట్
  • కిలోపై రూ.15 వేలు తగ్గి రూ.2.90,000కు చేరిన వెండి ధర
Gold Silver

Gold Silver

గోల్డ్, సిల్వర్ ధరలు నేడు మరోసారి పతనమయ్యాయి. నిన్న తులం బంగారంపై రూ.2000 కు పైగా తగ్గగా నేడు రూ. 980 తగ్గింది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. నేడు కిలో సిల్వర్ ధర రూ. 15000 తగ్గింది. ఈ రోజు హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.15,693, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,385, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,770 గా ట్రేడ్ అవుతోంది.

ఈ రోజు హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98040 తగ్గి రూ.1,56,930 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 900 తగ్గి రూ.1,43,850 వద్దకి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,080 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో సిల్వర్ ధర రూ. 15000 తగ్గి రూ.2,90,000 వద్ద సేల్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 10000 తగ్గి రూ. 2,80,000 వద్దకి చేరింది.