Diwali 2025 Muhurat Trading: ఈ సంవత్సరం దీపావళి పండుగ, ముహూర్త ట్రేడింగ్ గురించి ప్రజలలో గందరగోళం నెలకొంది. దేశం వ్యాప్తంగా దీపావళి రోజు సెలవు దినం, అయినా ఆ రోజు స్టాక్ మార్కెట్ మాత్రం తెరిచి ఉంటుంది. ఈ ఏడాది సోమవారం దీపావళి పండుగను నిర్వహిస్తున్నారు. అయినా స్టాక్ మార్కెట్ మాత్రం పండుగ రోజంతా తెరిచి ఉండనుంది. అలాగే పండుగ రోజున మార్కెట్‌లో ముహూర్త ట్రేడింగ్ జరుగుతుంది. చాలా మంది కొనుగోలుదారులు దీనిని శుభప్రదంగా భావిస్తారు. ఇంతకీ ఈ ఏడాది పండుగ సమయంలో ముహూర్త ట్రేడింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Nara Rohith : నారా రోహిత్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి
అక్టోబర్ 21న ముహూర్తపు ట్రేడింగ్
పలు హిందూ గ్రంథాల ప్రకారం.. దీపావళిని ప్రతి ఏటా అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది అమావాస్య అక్టోబర్ 20న ప్రారంభమవుతుంది. కాబట్టి దీపావళి అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. పండుగ రోజున స్టాక్ మార్కెట్ తెరిచి ఉంటుందని మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) దీపావళి కోసం మార్కెట్ సెలవులు, ముహూర్త ట్రేడింగ్ షెడ్యూల్‌ను ప్రకటించాయి. స్టాక్ మార్కెట్ అక్టోబర్ 21 మధ్యాహ్నం దీపావళిని జరుపుకోనుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. స్టాక్ మార్కెట్‌లో ప్రతి సంవత్సరం దీపావళి రోజున ముహూర్త ట్రేడింగ్ జరుగుతుంది. ఈసారి ముహూర్త ట్రేడింగ్ సమయం ప్రతి ఏడాది జరిగేలా సాయంత్రం కాదు, మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
BSE సమాచారం ప్రకారం.. స్టాక్ మార్కెట్ అక్టోబర్ 22న బుధవారం మూసి వేయనున్నారు. సాధారణ ట్రేడింగ్ అక్టోబర్ 23న తిరిగి ప్రారంభమవుతుంది. దీనికి ముందు అంటే దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరిగే అక్టోబర్ 20న రోజంతా ట్రేడింగ్ జరుగుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబర్ 21, 2025 (మంగళవారం) లక్ష్మీ పూజ (దీపావళి) సందర్భంగా మార్కెట్ మూసి వేయనున్నారు. ఈ రోజున ముహూర్తపు ట్రేడింగ్ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరుసటి రోజు, అలాగే అక్టోబర్ 22 (బుధవారం) కూడా ట్రేడింగ్ నిలిపి వేయనున్నట్లు పేర్కొన్నారు.
భారతీయ సంప్రదాయం ప్రకారం.. ముహూర్తపు ట్రేడింగ్ కొత్త ఆర్థిక సంవత్సరం (సంవత్ 2082) ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడిదారులు తమ కొత్త పెట్టుబడులను ప్రారంభిస్తారు. దీనిని చాలా మంది పెట్టుబడిదారులు శుభసూచకంగా భావిస్తారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, కరెన్సీ, కమోడిటీ డెరివేటివ్స్ విభాగాలలో ట్రేడింగ్ అనుమతించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ముహూర్త ట్రేడింగ్ సెషన్‌లో జరిగే ట్రేడ్‌లు సాధారణంగానే జరుగుతాయని NSE, BSE రెండూ కూడా స్పష్టం చేశాయి. ఇదే సమయంలో మార్కెట్ నిపుణులు మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా సానుకూల సెంటిమెంట్, పండుగ ఉత్సాహం మార్కెట్‌లో స్వల్ప పెరుగుదలకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ముహూర్త ట్రేడింగ్ సమయంలో భావోద్వేగాల కారణంగా గణనీయమైన రిస్క్‌లను తీసుకోకుండా, తెలివిగా పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులకు వాళ్లు సూచించారు.
READ ALSO: Nepal Gen Z Party: నేపాల్‌లో జనరల్ జెడ్ కొత్త పార్టీ.. ఎన్నికల్లో పోటీ చేస్తుందా?
