NTV Telugu Site icon

Business Ideas: అదిరిపోయే బిజినెస్ ఐడియా.. నెలకు రూ. లక్షకు పైగా ఆదాయం..

Bussiness Plan

Bussiness Plan

వ్యాపారం చెయ్యాలనుకుంటే సరిపోదు.. మనం చెయ్యాలనుకొనే బిజినెస్ గురించి మరింత సమాచారం తెలుసుకొని దిగితే మంచి లాభాలను పొందుతారు.. పెద్ద చదువులు అవసరం లేకుండా చేసే అదిరిపోయే బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్ర రుణాలతో మీరు వ్యాపారం చేసినట్లయితే, ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. .మీరు ముద్ర లోన్ పొందాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య బ్యాంకును సంప్రదిస్తే సరిపోతుంది. దానికి కావాల్సినటువంటి దరఖాస్తులు ఇతర పత్రాలను సమర్పించడం ద్వారా ఎలాంటి తనఖా లేకుండానే మీరు 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు..

ఈ మధ్య సబ్బుల తయారీ వ్యాపారం బాగా సాగుతుంది.. మీరు సబ్బుల వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే, దీనికి సంబంధించినటువంటి శిక్షణ పొందితే మంచిది. తద్వారా మీరు మార్కెట్లో డిమాండ్ను బట్టి సబ్బులను తయారు చేయవచ్చు. సబ్బుల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో మీరు పోటీ పడలేకపోవచ్చు.. సబ్బులు తయారు చెయ్యడానికి మంది కూడా కావాలని తెలుసుకోండి..

ఇకపోతే సబ్బులకు సంబంధించిన ముడి పదార్థాల కోసం హోల్సేల్ మార్కెట్ నుంచి సరుకులను తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సుగంధ తైలాలను కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ముడి సరుకుగా ఉపయోగపడతాయి. హస్త కళలను ప్రోత్సహించే ప్రభుత్వ దుకాణాల్లో మీరు ఈ సబ్బులను విక్రయించవచ్చు. మార్కెట్లో ఎన్ని సబ్బులు ఉన్నప్పటికీ హ్యాండ్ మేడ్ వస్తువులకు చాలా డిమాండ్ ఉంటుంది. మీరు తయారు చేసే సబ్బు మార్కెట్లో ఉన్నటువంటి ఇతర సభ్యులతో పోల్చితే ప్రత్యేకతను కలిగి ఉన్నట్లయితే కస్టమర్లు ఎక్కువగా మీ సబ్బులను ఇష్ట పడతారు..

సబ్బు పరిశ్రమను ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీరు కొన్ని పర్మిషన్లను పొందాల్సి ఉంటుంది. మున్సిపాలిటీ నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే జీఎస్టీ నెంబర్ కూడా పొందాలి.. ఇక యాడ్ ఇవ్వడం ద్వారా కూడా పబ్లిసిటీని పెంచుకోవచ్చు.. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా త్వరగా ఫెమస్ అవ్వొచ్చు.. ఏ బిజినెస్ అయిన ముందు మార్కెట్ చెయ్యడం మంచిది..