NTV Telugu Site icon

లాక్‌డౌన్ కొత్త స‌డ‌లింపులు.. బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో మార్పు

Bank

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మ‌రో వారం రోజుల పాటు పొడిగించింది రాష్ట్ర ప్ర‌భుత్వం… అయితే, ఇదే స‌మ‌యంలో.. గ‌తంలో ఉన్న స‌డ‌లింపుల స‌మ‌యాన్ని పెంచింది.. గ‌తంలో ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కే స‌డ‌లింపులు ఉండ‌గా.. ఇప్పుడు ఆ స‌మ‌యాన్ని ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు.. ఇక‌, ఇళ్ల‌కు చేరుకోవ‌డానికి మ‌రో గంట‌ల స‌మ‌యం ఇచ్చింది.. దీంతో.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది.. ఈ నేప‌థ్యంలో బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు స‌మావేశ‌మైన రాష్ర్ట స్థాయి బ్యాంక‌ర్ల క‌మిటీ.. ప్ర‌స్తుతం ఉన్న బ్యాంకుల ప‌ని వేళ‌ల‌పై స‌మీక్షించింది. లాక్‌డౌన్ స‌మ‌యం స‌డ‌లింపుతో ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు బ్యాంకుల సేవ‌లు అందుబాటులో ఉంచాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు.. మారిన బ్యాంకు వేళ‌లు జూన్ 1వ తేదీ నుంచి అంటే రేప‌టి నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. బ్యాంక‌ర్ల క‌మిటీ నిర్ణ‌యం.. జూన్ 9వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నుంది.. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేశాయి బ్యాంకులు.. ఇప్పుడు 10 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేయ‌నున్నాయి.. మొత్తంగా 4 గంట‌లు మాత్ర‌మే బ్యాంకులు ప‌నిచేస్తాయి. తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను జూన్ 9వ తేదీ వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే.